ఆంధ్రప్రదేశ్‌

ఇక రాష్టమ్రంతటా గురజాల ప్రయోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 13: తెలుగుదేశం పార్టీలో పెరిగిపోతున్న ముఠా తగాదాలు, అనైక్యతకు తెరదించేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన ఫార్ములా పనిచేయడం ప్రారంభించింది. పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో కూడా అగ్రనేతల మధ్య సయోధ్య లేక బలహీనపడుతుండటాన్ని గమనించిన బాబు, వారందరినీ ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్లి అందరూ కలిసి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఆయన ఈ విషయాన్ని చాలాకాలం నుంచి చెబుతున్నా ఆచరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఇటీవల పార్టీకి గుండెకాయ వంటి గుంటూరు జిల్లా పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంలో బాబు ఆ జిల్లా నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో జరుగుతున్న వసూళ్ల తీరుపై మాట్లాడుతూ మీ అందరి జాతకాలు నాదగ్గర ఉన్నాయని హెచ్చరించారు. మీ అందరి అనైక్యత వల్ల పార్టీకి పెట్టని కోట లాంటి జిల్లా నష్టపోతోందని, మీ అసమర్థత వల్ల పార్టీ నష్టపోతుంటే చూస్తూ సహించేది లేదని, త్వరలో మిమ్మల్ని విడిగా పిలిచి మాట్లాడతానని మందలించారు. అదే సమయంలో మీరు విడిగా ఉన్నారన్న సంకేతాలు ప్రజలతోపాటు, ఇతర పార్టీలకూ వెళ్లినందున, దానికి మీ పనితీరుతోనే జవాబు చెప్పాలని ఆదేశించారు. ఏదో ఒక నియోజకవర్గంలో నాయకులంతా ఒక కార్యక్రమానికి వెళ్లి అక్కడి కార్యకర్తలతో గడపటం ద్వారా అంతా కలసి ఉన్నామన్న సంకేతాలివ్వాలని ఆదేశించారు. అయినా సమావేశంలో ఉన్న ఇద్దరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వౌనంగా ఉన్న నేపథ్యంలో గురజాల సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందించి, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని ముందుకువచ్చారు. ఆ తర్వాత కేవలం ఆరురోజుల వ్యవధిలోనే గురజాల నియోజకవర్గంలో ప్రజాచైతన్యయాత్ర నిర్వహించి, దానికి పార్టీ అగ్రనేతలందరినీ ఆహ్వానించారు. అదేరోజు మార్కెటింగ్‌యార్డు చైర్మన్ ప్రమాణస్వీకారం కూడా నిర్వహించారు, ఎన్నికల ప్రచార స్థాయిలో ప్రజాచైతన్యయాత్రలు నిర్వహించడం, దానికి 30 వేలమంది హాజరుకావడంతో యరపతినేని మరోసారి ముఖ్యమంత్రి దృష్టిలో నిలిచారు. విభజనకు అనుకూలంగా లేఖ రాసిన సమయంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు, బాబు విపక్షనేతగా ఉన్నప్పుడు జిల్లాలో తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. అయితే లాయర్లు, సమైక్యవాదులు అడ్డుకుంటారని భయపెట్టడంతోపాటు, యాత్ర ఖర్చుకు భయపడిన నాటి గుంటూరు జిల్లా నేతలు యాత్ర నిర్వహణకు వెనుకంజ వేశారు. ఆ సమయంలో కూడా ఎమ్మెల్యే యరపతినేని ధైర్యంగా ముందుకొచ్చి ఆర్థికభారం, జనసమీకరణ బాధ్యతను భుజాన వేసుకుని 2013 సెప్టెంబర్ 1న పొందుగల నుంచి బాబు చేపట్టిన ఆత్మగౌరవ యాత్రను విజయవంతం చేసి అధినేత పెదవులపై చిరునవ్వు పూయించారు. దానితో తెలుగుదేశంలో గురజాల ఒక సెంటిమెంట్‌గా మారింది. అంతకుముందు వైఎస్‌కు చేవెళ్ల సెంటిమెంట్‌గా ఉండేది. మళ్లీ ఇప్పుడు కూడా బాబు ఆదేశాలను ఎవరూ పాటించని సమయంలో అదే యరపతినేని ముందుకొచ్చి, పార్టీ నిలబడేందుకు ప్రజాచైతన్యయాత్రలు నిర్వహించి నాయకత్వాన్ని మెప్పించడంతోపాటు, అదే విధానాన్ని అన్ని జిల్లాలో పాటించేందుకు కారకులయ్యారు. కాగా తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా, పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై కథనాలు రాగా, ఎమ్మెల్యే యరపతినేనిని పిలిపించిన సీఎం, అక్కడికి వెళ్లి పరిస్థితి ఏమిటో తెలుసుకుని, సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. దానితో ఐజి, ఎస్పీతో అసెంబ్లీ బయట పరిస్థితిని పరిశీలించి, మీడియా-పోలీసులకు కావలసిన సౌకర్యాలను తాను సొంతంగా సమకూరుస్తానని సీఎంకు భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొద్దిరోజుల నుంచి బాబు నివాసంలో జరుగుతున్న జిల్లాల సమీక్షా సమావేశాల్లో చంద్రబాబు గురజాల ప్రయోగాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘మీరంతా కలసి ఉన్నామన్న సంకేతాలు ఎందుకు పంపించలేకపోతున్నారు? గురజాలలో యరపతినేని తీసుకున్న చొరవ మీరెందుకు తీసుకోరు? అక్కడ ప్రజాచైతన్యయాత్రలు బ్రహ్మాండంగా చేసి అందిరినీ ఇన్వాల్వ్ చేసి మంచి సిగ్నల్స్ పంపించారు. మీరూ అలాగే చేయండి’ అని ఆదేశిస్తుండటంతో, తాము కూడా అలాగే చేస్తామని నేతలు భరోసా ఇస్తున్నారు. దీనివల్ల పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యంతోపాటు, పైస్థాయి నేతలంతా కలసి ఉన్నందున తాము కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలన్న భావన ఏర్పడుంతుందన్న వ్యూహంతోనే బాబు, గురజాల ఫార్ములాను రాష్ట్రం మొత్తానికి పాటించేలా చూస్తున్నట్లు కనిపిస్తోంది.

గురజాలలో యరపతినేని నిర్వహించిన ప్రజాచైతన్యయాత్రకు హాజరైన గుంటూరు జిల్లా టిడిపి అగ్రనేతలు (ఫైల్ ఫొటో)