ఆంధ్రప్రదేశ్‌

యంత్రాల తరలింపు ఇంకెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: పోలవరం పనులకు సంబంధించి భారీ యంత్రాల తరలింపులో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ యంత్రాలను తరలించకపోవడంపై కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉండవల్లిలోని తన నివాసం నుంచి సోమవారం సిఎం సమీక్ష నిర్వహించారు. సిఎం మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన యంత్ర పరికరాలను, ఇతర సామగ్రిని యుద్ధప్రాతిపదికపై తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పెంటా కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లు, కాంక్రీట్ ట్రక్కులు, వాటర్ చిల్లింగ్ ప్లాంట్లు, డ్రిల్లింగ్, చిల్లింగ్ యంత్రాలను ఇంకా అందుబాటులోకి తీసుకురాకపోవడంపై కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. వీటిని సమకూర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్మాణ ప్రాంతానికి అందుబాటులోకి వచ్చేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సంస్థలు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు.
నిర్మాణ సంస్థలు పరస్పరం సహకరించుకోవాలని, సమస్యలు తలెత్తితే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. లేని సమస్యలు సృష్టించి సమయం వృథా చేయవద్దని స్పష్టం చేశారు. పనుల ప్రగతి తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్పిల్ చానల్‌కు సంబంధించి ఇంకా 254.8 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం జరగాల్సి ఉంది. లెఫ్ట్ ప్లాంక్, అప్రోచ్ చానల్, పైలట్‌చానల్ పనులకు సంబంధించి 174.51 లక్షల క్యూబిక్ మీటర్ల త్వవకం చేపట్టాల్సి ఉంది. సమీక్షలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, సిఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఇఎన్‌సి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.