ఆంధ్రప్రదేశ్‌

పోరుబాటలో హౌసింగ్ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 13: గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల జియో టాగింగ్ పనులకే పరిమితమైన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ యంత్రాంగం పలు సమస్యల నేపథ్యంలో పోరుబాట పట్టింది. చేతినిండా పని కల్పించకుండా తమను శంకించడం ఎంత వరకు సబబు అంటూ వారు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు సంస్థ ఎండిని కలవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఎట్టకేలకు దశల వారీ పోరాటానికి జెఎసి సన్నద్ధమైనట్టు సమాచారం. ప్రధానంగా ఇటీవల కాలంలో ‘పనితీరు ఆధారిత జీతం చెల్లింపు’ విధానంతో యంత్రాంగం తీవ్ర ఆగ్రహవేశాలకు లోనవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ కార్పొరేషన్‌లోనూ అమలుచేయని విధంగా గృహ నిర్మాణ సంస్థలో మాత్రం పనితీరు శాతాన్ని బట్టి జీతం ఇచ్చే విధానం ప్రవేశపెట్టి, చివరి నిముషంలో విరమించుకున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి మాసంలో కేవలం 61 శాతమే పనిచేశారని, ఆ శాతానికే జీతం బిల్లు పంపించడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడంతో మిగిలిన 39 శాతం జీతం అనంతరం వేయాల్సివచ్చింది. ఫెర్ఫార్మెన్స్ శాలరీ విధానం ప్రవేశపెట్టడంపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగులు సన్నద్ధమైనట్టు తెలిసింది. ఆఫీసుకు హాజరైతే జీతం ఇవ్వాలనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కుగా వుంది. ఈ ప్రాథమిక హక్కుకు కూడా భంగం కలిగేలా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పనితీరుకు ఆటంకంగా మారిన ఆన్‌లైన్ సమస్యలు పరిష్కరించాలని ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు వివరించినా పట్టించుకోని దుస్థితి ఉందంటున్నారు. ఇటువంటి సమస్యలు పరిష్కరించిన తర్వాత కూడా పనితీరు బాగోలేదంటే చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. పని తీరును బట్టి జీతం తీసుకునే విధానం అందరికీ వర్తిస్తుందని, యంత్రాంగం పనితీరు బాగాలేదంటే రాజధానిలో ఉన్నత స్థానాల్లో కూర్చున్నవారి పని తీరు కూడా బాగుండలేనట్టే లెక్కని, వారి జీతంలో కూడా కోత విధిస్తూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. గృహ నిర్మాణ సంస్థలో అక్రమాలకు తావులేకుండా ఆధునిక విధానాల పేరుతో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్ విధానం ఒకటి. అయితే ఇందులో సమస్యలు చుట్టుముడుతుంటే కొత్తగా సరఫరా చేసిన టాబ్లెట్ కంప్యూటర్లు నాసిరకం కావడంతో అసలు పని చేయకుండానే మొరాయిస్తూ మూలనపడ్డాయి. జియో టాగింగ్, జియో ఫెన్సింగ్‌కు ఉపయోగించే విధంగా ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థలో సెల్‌కాన్ టాబ్లెట్ కంప్యూటర్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 టాబ్లెట్ కంప్యూటర్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇవన్నీ మూలనపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ గృ నిర్మాణం జరిగినపుడు ఇచ్చిన మైక్రోమాక్స్ డిజిటల్ కెమెరాలతోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ సంస్థలో ఆధునికత నిరుపయోగంగా మారింది.