ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌బిఐ అధికారులపై సిబిఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 13: నెల్లూరు జిల్లా బుచ్జిరెడ్డిపాలెం ఎస్‌బిఐ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ అధికారులు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలు పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం బ్రాంచ్‌లో సీనియర్ స్పెషల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుల్తాన్ మొహిద్దీన్, డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్స్) జె.రాజశేఖర్ కలిసి 2016 నవంబర్ 15 నుంచి 25 తేదీల మధ్య బినామీ పేర్లతో మూడు గోల్డ్ లోన్‌లు మంజూరు చేశారు. కొత్త నోట్ల మంజూరుపై ఆంక్షలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా వీరు సుమారు 2.70 లక్షల రూపాయలను వీరికి రుణ మొత్తం కింద అందచేశారు. అదే నెల 21 నుంచి 25 తేదీల మధ్య రెండు గోల్డ్ లోన్‌లను తిరిగి క్లోజ్ చేశారు. ఈ లోన్‌లు క్లోజ్ చేయడానికి సదరు వ్యక్తుల నుంచి రద్దయిన 1000, 500 నోట్లను తీసుకున్నారు. ఈ విధంగా 12.40 లక్షల రూపాయల మేర అవకతవకలకు పాల్పడినట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్లను సీజ్ చేసి, మొహిద్దీన్, రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిబిఐ ఎసిబి ఎస్పీ గోపాలకృష్ణారావు తెలిపారు.