ఆంధ్రప్రదేశ్‌

భూమా మృతిపై సంతాపానికి వైసిపి దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 14: సభలో సభ్యుడు మృతి చెందిన సందర్భంలో పార్టీలకు అతీతంగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టే సంప్రదాయానికి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దూరంగా ఉండటం ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది. తీర్మానానికి దూరంగా ఉండాలంటూ వైసీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ నేతలు సభకు వెళ్లి సంతాపం ప్రకటించాల్సి ఉందని వాదించగా, మరికొందరు మాత్రం ఈ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని వాదిస్తున్నారు.
అయితే, సభ లోపల జరిగిన సంతాప తీర్మానానికి దూరంగా ఉన్న వైసీపీ, బయట మాత్రం చంద్రబాబునాయుడు మానసికంగా వేధించినందువల్లే భూమా మృతి చెందారన్న ప్రచారానికి తెరలేపింది. దానితోపాటు భూమా అంత్యక్రియలు జరిగి ఒకరోజు కూడా కాకముందే ఆయన కుమార్తె అఖిలప్రియను సభకు తీసుకురావడాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించడం ద్వారా తన వాదన సరైనదేనని చెప్పే ప్రయత్నం చేసింది.
భూమా నాగిరెడ్డికి మృతికి మంగళవారం సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి వైసీపీ హాజరుకాలేదు. కానీ, జగన్ తన చాంబర్‌లోనే ఉండి మీడియా, పార్టీ సభ్యులతో మాట్లాడారు. విశే్వశ్వర్‌రెడ్డి, గిడ్డి ఈశ్వరి, నారాయణస్వామి, దేశాయి తిప్పారెడ్డి, పినె్నల్లి రామకృష్ణారెడ్డి, దాడిశెట్టి రాజాని పురమాయించి భూమా నాగిరెడ్డి సంతాపసభకు తామెందుకు రాలేదని చెప్పకుండా, అసలు భూమా మృతికి చంద్రబాబునాయుడు కారణమన్న విషయాన్ని ప్రజల్లోకి పంపించేందుకే ప్రాధాన్యం ఇచ్చారు.
ఇదిలాఉండగా, అసలు సభకు వెళ్లి తీర్మానంపై మాట్లాడకపోవడాన్ని పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్లు తప్పుపడుతున్నారు. సభకు వెళ్లి సంతాపం ప్రకటించి, బయట చెప్పిన విషయాలే లోపల చెబితే జనం కూడా అర్థం చేసుకునేవారని, కానీ ఇప్పుడు తామే సెల్ఫ్‌గోల్ చేసుకున్నామని, జగన్‌కు ఈ సలహాలు ఎవరు ఇస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. ‘సాంకేతికంగా భూమా మా సభ్యుడే. ఆయన మా పార్టీలో ఉన్నప్పుడు బాబు ప్రభుత్వం రౌడీషీట్, ఎస్సీఎస్టీ కేసులు పెట్టించిన వైనం చెప్పాల్సింది. సభకు వెళ్లి మృతి చెందిన సభ్యుడి మీద చెడుగా చెప్పడం పద్ధతి కాదని, మాట్లాడే సమయంలో భూమా పార్టీ మారిన వైనం ప్రస్తావిస్తే అప్పుడు టిడిపి నుంచి ఎదురుదాడి జరిగితే, చనిపోయిన వ్యక్తి పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లవుతుందన్న ఉద్దేశంతోనే సభకు వెళ్లలేదని మరికొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ప్రధానంగా.. ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నందున, ఇక్కడ సంతాపసభలో భూమాను పొగిడితే దాని ప్రభావం అక్కడి క్యాడర్‌పై పడుతుందని అసలు కారణం అవిష్కరించారు. ‘మేం ఇక్కడ భూమాను పొగిడి, నంద్యాలకు వెళ్లి క్యాడర్‌కు ఏం చెబుతాం? పైగా మా పొగడ్తను ఎన్నిక ప్రచారంలో టిడిపి వాళ్లు గుర్తు చేస్తే రాజకీయంగా నష్టం కదా? అందువల్ల అసలు సభకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని నిర్ణయించుకున్నా’మని మరికొందరు ఎమ్మెల్యేలు చెప్పారు.