ఆంధ్రప్రదేశ్‌

రావూరి దంపతులు భవిష్యత్ తరాలకు ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 14: రావూరి అర్జునరావు, మనోరమ దంపతుల జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శమని మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. రావూరి అర్జునరావు శత వసంతాల జన్మదినోత్సవం మంగళవారం ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాలు వేదికగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోసయ్య మాట్లాడారు. సమాజాన్ని మేల్కొనే విధంగా రావూరి అర్జునరావు దంపతులు చేసిన కృషి వెలకట్టలేనిదిగా పేర్కొన్నారు. కులమతాలకతీతంగా సమాజాభివృద్ధికి కృషి చేసిన ఆ దంపతులు భవిష్యత్‌తరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఇటువంటి కార్యక్రమాలను సమాజానికి అందిస్తున్న ఘనత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కి దక్కుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో సమాజంలో మార్పుకి, యువతలో చైతన్యాన్ని కలిగించడానికి దోహదం చేస్తాయన్నారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ రావూరి దంపతులు నూతన దంపతులకు, యువతకు ఆదర్శమన్నారు. వారి స్ఫూర్తితో సమాజంలో చైతన్యం తెచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆదర్శ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసి ఆచార్య నాగేశ్వరరావు, మాజీ ఎంపీ సబ్బం హరి తదితరులు పాల్గొన్నారు.