ఆంధ్రప్రదేశ్‌

మండలి అంటే చిన్నచూపా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాము మాట్లాడుతుండగా, వివరణ అంటూ మంత్రులు ఎదురుదాడికి దిగటంతో ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన సమయంలో మంత్రులు మాట్లాడుతున్నా, చైర్మన్ నియంత్రించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాష్ట్ర శాసన మండలిలో మంగళవారం చర్చ జరిగింది. చర్చ ప్రారంభ సమయంలో సభలో మంత్రులు ఎవరూ లేకపోవడంతో సభ్యులు చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, తదితరులు మండలి అంటే ఇంత చులకనా? అంటూ వ్యాఖ్యానించారు. మంత్రులు వచ్చే వరకూ చర్చను నిలిపివేద్దామని తెలిపారు. ఈలోగా మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సభలోకి రావడంతో ఆపద్బాంధవుడివి అంటూ మండలి చైర్మన్ చక్రపాణి వ్యాఖ్యానించారు.
గవర్నర్ ప్రసంగం ఎందుకు?
మంత్రివర్గం తయారు చేసిన దానిని సభలో గవర్నర్ చదవడం ఆనావాయితీ ఉందని, కానీ అలా ఎందుకు? అని రామచంద్రయ్య ప్రశ్నించారు. దీనిపై ఆలోచించాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆయన గవర్నర్ అని, వివిధ అంశాల్లో తేడా ఉందని, అక్కడ వాళ్లకు మద్దతు ఇవ్వాలని, ఇక్కడ దానిని విభేదించాల్సి ఉంటుందన్నారు. ఇలా ప్రసంగం చదవాలని రాజ్యాంగంలో ఎక్కడా తనకు కనిపించలేదన్నారు. గవర్నర్, రాష్టప్రతికి మంత్రివర్గం మార్గదర్శకత్వం చేస్తుందని మండలి చైర్మన్ చక్రపాణి వివరించారు. అవకాశం ఇచ్చినప్పటికీ సిఎం అడగకపోవడం వల్ల నష్టపోతున్నారని రామచంద్రయ్య అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి సిఎం బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తాన్నారు. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కేంద్రాన్ని అడిగే శక్తి వస్తుందన్నారు. మధ్యలో మంత్రి పల్లె రఘనాథరెడ్డి జోక్యం చేసుకుని ఇటీవల జరిగిన ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతలు నిరాశకు లోనవుతున్నారన్నారు. ఆకాశంలో ఉన్న చంద్రుడి కన్నా మచ్చలు ఉన్నాయి కానీ తమ చంద్రునికి మచ్చలేదని స్పష్టం చేశారు. రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్న సిఎంను విమర్శించేందుకు నోరెలా వచ్చిందన్నారు. దీనిపై రామచంద్రయ్య స్పందిస్తూ, ‘మీరంతా కలిసి లోపలికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. వృద్ధి రేటు, పోలవరం తదితర అంశాలను ప్రస్తావించినప్పుడు మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథ రెడ్డి అడ్డుకుని వివరణ పేరుతో ఎదురుదాడి చేశారు. బిజేపి పక్ష నేత కూడా కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఆదుకుంటోదంటూ వివరణ ఇవ్వడంతో ఆయన రామచంద్రయ్య అసంతృప్తికి గురయ్యారు. అనంతరం వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతున్న సమయంలో కూడా మంత్రులు వివరణ పేరుతో అడ్డుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో 87, 612 కోట్ల రూపాయల మేర వ్యవసాయ రుణాల బకాయిలు ఉన్నట్లు తెలిపారన్నారు. దీనిపై మంత్రి పుల్లారావు జ్యోక్యం చేసుకుని ఇప్పటికే 11032 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాలని, 24 వేల కోట్ల రూపాయలు కూడా చెల్లిస్తామని స్పష్టం చేశారు.