ఆంధ్రప్రదేశ్‌

కమలంతో కలసి నడుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 14: భవిష్యత్తులో కూడా తమ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలసి పనిచేస్తుందన్న సంకేతాలు ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి వరకూ కొనసాగిన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల సమావేశంలో బాబు ఈ మేరకు తన మనసులో మాట వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మీరు బిజెపి నేతలతో ఎక్కడా ఘర్షణ పడవద్దు. ఇప్పుడున్న పరిస్థితిలో భవిష్యత్తులో బిజెపితో కలసి వెళ్లకతప్పదు. రానున్న ఎన్నికల్లో కూడా ఆ పార్టీతో కలసివెళ్లాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులను కలసి పరిష్కరించుకోండని తాడేపల్లిగూడెంలో బిజెపి-తెదేపా నేతల మధ్య కొనసాగుతున్న విబేధాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి రానున్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ బిజెపితో కలసి వెళ్లటం ఖాయంగా కనిస్తోంది.
ఇక జిల్లాలో మంత్రి పీతల సుజాత-ఎంపి మాగంటి బాబు-పోలవరం ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న అధిపత్యపోరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో మందలించారు. మీ దగ్గర బాగా మైనస్ ఉంది. సరిదిద్దుకోకపోతే ఇద్దరూ నష్టపోతారు అని హెచ్చరించారు. మంత్రి సుజాత పనితీరుపైనా పెదవి విదిల్చి, నిన్ను ఎక్కడికో తీసుకువెళ్లినా దానికి తగ్గ ఫలితాలు రాబట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మీ జిల్లా నేతలు, మంత్రుల పనితీరుపై మీడియాలో ఎక్కువగా వార్తలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. మీడియాలో పొంతన లేకున్నా ఒక్కొసారి వార్తలు వస్తుంటాయని చెబుతూ ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఐదు కథనాలను ప్రస్తావించారు. మీ అందరి పనితీరుకు సంబంధించి నివేదికలు నా వద్ద ఉన్నాయని, మళ్లీ ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడతానన్నారు.
దేశవ్యాప్తంగా మళ్లీ నగదు కొరత ఉందని మరో సందర్భంలో వ్యాఖ్యానించారు. జగన్ ఒక ఫ్యాక్షనిస్టులా పనిచేస్తున్నారని, ఈ రోజు అతని వ్యవహారశైలి మీరంతా చూశారు కదా అని వ్యాఖ్యానిస్తూ, అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.