ఆంధ్రప్రదేశ్‌

నివాళిలో జగన్‌పై నిప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: ఒక కాకి చనిపోతే.. జాతిలో కాకులన్నీ వాలి రొద పెడుతుంటాయి.. శత్రువు చనిపోయినా ఇంటికెళ్లి కుటుంబాన్ని ఓదార్చి నాలుగు మంచి మాటలు చెప్పి సానుభూతి చూపటమనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం.. సహచర శాసనసభ్యుడు.. అందునా తాను జైల్లో ఉంటే పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి అకాల మరణానికి గురైతే భౌతికకాయాన్ని సందర్శించకపోవటం అటుంచి సభలో సంతాప తీర్మానంపై మాట్లాడటానికి ఇష్టపడని ప్రతిపక్ష నేత ఓ శాడిస్ట్.. సభలో తొలిసారిగా దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారంటూ శాసనసభలో అధికారపక్ష సభ్యులతోపాటు ఇటీవల వైకాపాను వీడి వలస వచ్చిన సభ్యులు సైతం జగన్‌పై నిప్పులు చెరిగారు. దివంగత నాగిరెడ్డి బావమరిది ఎస్వీ మోహనరెడ్డి మాట్లాడుతూ జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా నాగిరెడ్డి స్వయంగా పరిష్కరించారన్నారు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత, దేవినేని ఉమ, యనమల, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన, అనిత, యరపతినేని, కళా వెంకట్రావు, మోదుగుల, కూనా రవి, బొండా ఉమ, డేవిడ్‌రాజు తదితరులు ఘనంగా నివాళులర్పించారు.