ఆంధ్రప్రదేశ్‌

సాగర్ కుడికాల్వకు ఆకస్మికంగా నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, మార్చి 14: నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుండి సాగర్ కుడి కాలువకు మంగళవారం తెల్లవారుజాము నుండి నీటిని ఆకస్మికంగా విడుదల చేశారు. కొద్ది రోజుల కిందట సాగర్ కుడి కాలువకు విడుదల చేసే నీటిలో ఆవిరైన నీటి పేరుతో 1.5 టిఎంసీల నీరు ఇవ్వలేదని కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ బోర్డు అధికారులు స్పందించి కుడి కాలువకు తక్షణమే నీటిని విడుదల చేయాలని చెప్పడంతో మంగళవారం తెల్లవారుజామున ప్రాజెక్టు అధికారులు ఆకస్మికంగా నిర్ణయం తీసుకుని విడుదల చేయాల్సిన 1500 క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ నుండి నీరు విడుదల విషయాన్ని గమనించిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

చిత్రం..సాగర్ కుడి కాలువలో ప్రవహిస్తున్న నీరు