ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ చరిత్రలో వైసిపి తీరు మాయనిమచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) మార్చి 14: శాసనసభలో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష నాయకుడుగా జగన్ రాలేదంటే ఆరు దశాబ్దాల అసెంబ్లీ చరిత్రలో వైకాపా నిర్ణయం మాయనిమచ్చగా మిగిలిపోతుందని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ జగన్ జైల్లో వున్నప్పుడు ఆయనకు అండగా వుంటూ భూమా దంపతులు ధైర్యం చెప్పారని అటువంటిది భూమా నాగిరెడ్డి చనిపోతే కనీసం జగన్ శ్రద్ధాంజలి ఘటించకపోవటం చూస్తుంటే ఇంత దారుణమైన మానిసిక స్థితి వున్న వ్యక్తులు కూడా వుంటారా అనిపిస్తోందన్నారు.
దుష్ట సంప్రదాయం
అసెంబ్లీకి వచ్చిన జగన్ సభలో భూమా నాగిరెడ్డి సంతాప సభ తీర్మానం జరుగుచున్న సమయంలో డుమ్మా కోట్టటం దుష్ట సంప్రదాయానికి, నీచమైన రాజకీయాలకు తెరదీశాడనీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. రాజకీయాలలో విభేదాలు వుండోచ్చుగానీ, మరణించిన వ్యక్తులకు సంతాపం తెలపటం అసెంబ్లీ సంప్రదాయాలను జగన్ పాతరవేస్తున్నాడని జగన్‌పై మండిపడ్డారు.
ప్రజాసేవలోనే పరమపదించారు
భూమా దంపతులు ప్రజా సేవచేస్తూనే ఆకస్మికంగా మృతి చెందటం ప్రతి ఒక్కరిని వేదనకు గురి చేస్తుందని అనంతపురం శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే యామిని బాల అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అమె మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానానికి జగన్ రాకపోవడం మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పనికిరాడు
రాజకీయాలలో శాశ్వత శత్రువులుగానీ, మిత్రులుగానీ వుండరని అయితే భూమా నాగిరెడ్డి తమ కుటుంబ సభ్యుడని చెప్పిన జగన్ ఆయన చనిపోతే సంతాప తీర్మానానికి రాకపోవటం జగన్ ప్రతిపక్షనాయకుడిగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడని టీడీపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. భూమా నాగిరెడ్డి కడసారి చూపుకి, శ్రద్ధాంజలి ఘటించకపోవటం జగన్ తీరు చూచి సొంత పార్టీవారే అస్యహించుకుంటున్నారని తెలిపారు.