ఆంధ్రప్రదేశ్‌

బతికుండగానే భూమాను వేధించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) మార్చి 14: అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తొందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్టి ఈశ్వరి తీవ్రస్థాయిలో టిడిపిపై ధ్వజమెత్తారు. మంగళవారం ఉదయం అమరావతి వెలగపూడిలో అసెంబ్లీ పాయింట్ వద్ద అమె మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి ఒకప్పుడు టిడిపీలో కీలక పాత్ర వహించారని, ఆ పార్టీకి ఎంత చేశారో ప్రజలకు తెలుసునని అలాంటింది అమె చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు టిడిపి నేతలు ఎందుకు రాలేదని ప్రశ్నంచారు. అనాడు అసెంబ్లీలో శోభా నాగిరెడ్డికి సంతాపం తీర్మానం తెలిపేందుకు కూడా టిడిపి ఇష్టపడలేదన్నారు. భూమా నాగిరెడ్డి వైఎస్సార్ పార్టీలో వున్నప్పుడు ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై రౌడీషీటు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల పెట్టించి పోలీసులతో అరెస్ట్ చేయించి వేధింపులకు గురిచేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకస్మిక మరణం బాధకరమని వైఎస్సార్ సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశే్వశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన వైసీపీ ఎమ్మెల్యేలతో కలసి మాట్లాడుతూ భూమా కుటుంబం పడుతున్న బాధలో పాలుపంచుకుంటామని చెప్పారు.
భారతంలో శకుని.. నేడు బాబు!
దుర్యోధనుడి చావుకు శకుని కారణమైతే భూమా నాగిరెడ్డి చావుకు చంద్రబాబు కారణమని చిత్తూరు జిల్లా వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే నారాయణ స్వామి అన్నారు. మంళవారం అసెంబ్లీ పాయింట్ వద్ద ఆయన వైకాపా ఎమ్మెల్యేలతో కలసి మాట్లాడుతూ బతికున్నంతకాలం నాగిరెడ్డిని చంద్రబాబు పట్టించుకోలేదని మంత్రి పదవి ఆశ చూపి ప్రలోభాలు పెట్టి, చనిపోయిన తరువాత మాత్రం కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామంటూ చెప్పడం హాస్యాస్పదంగా వుందన్నారు.
శోభా నాగిరెడ్డి మృతి చంద్రబాబు ఎందుకు సంతాపం తెలపలేదో?
శోభా నాగిరెడ్డి మృతి చెందినప్పుడు కనీసం చంద్రబాబు ఎందుకు సంతాపం చెప్పలేదో సమాదానం చెప్పాలని వైఎస్సార్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు భూమా నాగిరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు ఆయనపై ప్రేమ గుర్తురాలేదా అని ప్రశ్నించారు. భూమా నాగిరెడ్డిని మానిసిక క్షోభకు గురి చేసి ఆయన చావుకు పరోక్షంగా చంద్రబాబే కారణమయ్యాడని వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్టారెడ్డి ఆరోపించారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి వైకాపా పార్టీ అండగా వుంటుందన్నారు.

చిత్రం..గిడ్డి ఈశ్వరి