ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో మరో షెన్‌జెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 14: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకునేందుకు మరో అంతర్జాతీయ దిగ్గజం ముందుకొచ్చింది. ప్రపంచశ్రేణి ప్రఖ్యాత నగరాభివృద్ధి సంస్థ ‘చైనా అకాడమీ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ షెన్‌జెన్’ (సీఏయూపీడిఎస్‌జెడ్) బృందం మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి తమ ప్రణాళికలను వివరించింది. గిజూ మారీటైమ్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్ (జీఐఐసీ), ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిజైన్ లిమిటెడ్‌లకు చెందిన ప్రతినిధులు కూడా ఈ బృందంలో ఉన్నారు. ప్రపంచశ్రేణి నగర ప్రణాళికలు-ఆకృతుల రూపకల్పన సంస్థగా ఉన్న సిపియుపిడిఎస్‌జెడ్ చైనాలోని ప్రఖ్యాత షెన్‌జెన్ నగరాభివృద్ధిలో ముఖ్య భూమిక వహించింది. చైనా నేషనల్ ప్లానింగ్ కన్సల్టెంట్ (సిఏయుపిడి)కు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ 1984 నుంచి షెన్‌జెన్ నగర అభివృద్ధిలో పాలుపంచుకుంటోంది. 1984కు ముందు సాధారణ మత్స్యకారుల గ్రామంగా ఉన్న షెన్‌జెన్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉంది. చైనాలో అత్యంత విజయవంతమైన ప్రత్యేక ఆర్థిక మండళ్లలో షెన్‌జెన్ మొట్టమొదటిది. దక్షిణ చైనాకు ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్న ఈ నగరంలో షెన్‌జెన్ స్టాక్ ఎక్ఛేంజ్‌తోపాటు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల సంస్థల ప్రధాన కార్యాలయాలు అనేకం ఉన్నాయి. దక్షిణ చైనాలోని గుయంగ్‌డోంగ్ ప్రావిన్స్‌లో ఉప-ప్రావిన్స్ పరిపాలక హోదా ఉన్న నగరం ఇది. హాంకాంగ్ దీనికి సిస్టర్ సిటీగా ఉంది. అత్యంత ఆధునిక నగరంగా, ప్రపంచంలోనే అత్యధిక ఆకాశ హార్మాలు గల సుసంపన్న ప్రాంతంగా పేరొందిన షెన్‌జెన్ గొప్ప ఆర్థిక కేంద్రంగా వెలుగొందుతోంది. షెన్‌జెన్ ప్రాంతాన్ని చైనాలో తొలి ప్రత్యేక ఆర్థికమండలిగా ప్రకటించినప్పుడు కచ్చితమైన ప్రణాళికలతో దశలవారీగా 2వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో, 5లక్షల ఎకరాల విస్తీర్ణంలో దాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దడంలో తమ భాగస్వామ్యం ఎంతో ఉన్నదని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. కొత్త రాష్ట్రం అభివృద్ధిలో, అమరావతి రూపకల్పనలో తమకు అవకాశం కల్పిస్తే షెన్‌జెన్ తరహా అభివృద్ధిని చూపించగలమని వారు చెప్పారు.
షెన్‌జెన్ తరహాలో ఏపీలో ఆర్థిక నగరాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చైనా బృందానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రెండు తీర ప్రాంత ఉపాధి మండళ్లను ప్రకటించిందని గుర్తుచేశారు. తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌లో, పడమటి తీరంలో గుజరాత్‌లో ఈ ఉపాధి మండళ్ల ఏర్పాటుకు కేంద్రం సంసిద్ధమవుతోందని చెప్పారు. నెల్లూరు-కృష్ణపట్నం-తిరుపతి-చెన్నయ్ నగరాలను కలుపుతూ ఏర్పాటయ్యే ఆర్థికమండలి రూపకల్పనలో సహకరించవచ్చునని చైనా బృందానికి ముఖ్యమంత్రి సూచించారు. తిరుపతి, విశాఖ ప్రాంతాల అభివృద్ధిలో, మరికొన్న పట్టణ ప్రాంతాలను ఆర్థక నగరాలుగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వామ్యం కావచ్చునని తెలిపారు. చైనా తరహా అభివృద్ధి ప్రణాళికలు కొత్త రాష్ట్రానికి అవసరమని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక ప్రాంతాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పట్టణ ప్రాంతాల అభివృద్ధిలో చైనా దేశపు వ్యూహాలు అత్యుత్తమ ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. అమరావతి నగర అభివృద్ధిలో ఏ రూపంలో సహకారం అందించడానికి అవకాశాలు ఉన్నాయో సమగ్ర ప్రణాళికలతో రావాలని చైనా బృందానికి ముఖ్యమంత్రి సూచించారు. తమ తొలి ప్రాధాన్యం అమరావతి నగర నిర్మాణమేనని, ప్రత్యేక ఆర్థిక మండళ్ల రూపకల్పనకు మలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. మచిలీపట్నం నగర అభివృద్ధి ప్రాజెక్టు, ఏపి అర్బన్ ప్రాంతాల అభివృద్ధి, గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులలో జిఐఐసి భాగస్వామ్యం కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని పెట్టుబడులు-వౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ముఖ్యమంత్రికి చెప్పారు.

చిత్రం..ముఖ్యమంత్రిని కలిసిన చైనా సంస్థల ప్రతినిధులు