ఆంధ్రప్రదేశ్‌

ఫుడ్‌పార్కుపై దద్దరిల్లిన తుందుర్రు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 14: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి ఫుడ్ పార్కు అనుకూల, వ్యతిరేక వర్గాలతో మంగళవారం ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఫుడ్ పార్కు కావాలని తుందుర్రు పరిసర గ్రామాల్లోని మద్దతుదారులు ఆందోళన చేయగా, నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న సిపిఎం ఆధ్వర్యంలో అఖిలపక్షం కొన్ని గ్రామాల్లో పర్యటించింది. ఫుడ్‌పార్కు నిర్మాణం కారణంగా తలెత్తే విపరిణామాలను వివరిస్తూ సిపిఎం సభలు నిర్వహించగా, సిపిఎం గోబ్యాక్ అంటూ అనుకూల వర్గానికి చెందిన వారు ఆందోళనలు నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు నరసాపురం నియోజకవర్గంలోని కంసాలి బేతపూడి, కొత్తపాలెం, ముత్యాలపల్లి, భీమవరం నియోజకవర్గంలోని తుందుర్రు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలన్నారు. డిమాండ్ చేశారు. యనమదుర్రు, గొంతేరు డ్రైయిన్ల కాలుష్యంపై త్వరలోనే తమ పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలో దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధోరణి సరిగాలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. ఈకార్యక్రమాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం తదితరులు పాల్గొన్నారు. కాగా ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా అఖిలపక్షం పర్యటించిన నేపథ్యంలో ఫుడ్‌పార్కు పరిసర గ్రామాలైన తుందుర్రు, జొన్నలగరువు, కరుకువాడ, నడిపల్లి తదితర గ్రామాల్లో అనుకూల వర్గాలు ఆందోళన చేపట్టాయి. సిపిఎం అఖిల పక్షం గోబ్యాక్ అంటూ నినదించారు. ఫుడ్‌పార్కుకు మద్దతుగా పాదయాత్ర, ప్రదర్శన నిర్వహించారు. కాగా ఫుడ్‌పార్కుకు మద్దతుగా ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు నిలువరించారు. ఈసందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు అనుకూల వర్గానికి బహుజన సమాజ్ పార్టీ, భారత రిపబ్లికన్ పార్టీ, ఎపి దళిత మహాసభ, మాలమహానాడు, అంబేద్కర్ యువజన సంఘం తదితర పార్టీలు, సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ సిపిఎం అఖిలపక్షం పై ఘాటుగా విమర్శలు చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు చిత్తశుద్ది ఉంటే తుందుర్రు పరిసర ప్రాంతాల్లోని దళిత ప్రాంతాలకు వచ్చి మాట్లాడాలన్నారు. తుందుర్రు ప్రాంతంలోని దళిత ప్రజల జీవితాలు చాలా దుర్బరంగా ఉన్నాయని, ఫుడ్‌పార్కు ప్రారంభమైతే వారికి జీవనోపాధి దొరుకుతుందన్నారు. సిపిఎం తమ పార్టీలో దళితులకు ఎందుకు కీలకపదవులు ఇవ్వడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్కు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు అండగా ఉంటామని ఇంజేటి ప్రసాద్ , దేశాబత్తుల సువర్ణరాజు, కాటిక చిట్టిబాబు, జగన్ ప్రకటించారు.