ఆంధ్రప్రదేశ్‌

జలవనరుల శాఖకు జవసత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, గృహావసరాల కోసం నీటిని అందించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వివిధ ప్రాజెక్టుల పనులు మరింత వేగవంతం చేసందుకు వీలుగా 2017-18 సంవత్సరం బడ్జెట్‌లో జలవనరుల శాఖకు భారీగా నిధులు కేటాయించారు. 12,770 రూపాయలను కేటాయించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేటాయింపుల కన్నా 7,978 కోట్ల రూపాయలు అధికం కావడం గమనార్హం. రాయలసీమ జిల్లాల్లో, ప్రకాశం జిల్లాలో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సాగునీటిని అందించేందుకు వీలుగా నిర్మాణంలో ఉన్న 7 పథకాలను పూర్తి చేసేందుకు వీలుగా కేటాయింపులు ఎక్కువ చేశారు. తోటపల్లి ప్రాజెక్టు, గాలేరి-నగరి సుజల స్రవంతి మొదటి దశ, హంద్రినీవా సుజల స్రవంతి, వంశధార 2వ స్థాయి రెండవ దశ పథకం, పోలవరం ఎడల ప్రధాన కాలువ పథకాలను 2017 నాటికి పూర్తి చేసేందుకు నిర్ణయించి, ఆ దిశగా కేటాయింపులు చేశారు. పోలవరం హెడ్ వర్క్సు నిర్మాణం 2018కి పూర్తి చేసేందుకు నిర్ణయించారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం ఈ ఖరీఫ్‌కే ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుండగా, చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ లైలీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు కింద 20 భారీ మధ్య తరహా సాగునీటి పథకాలను ఆధునీకరించడంతో పాటు 445 చిన్న తరహా నీటి పారుదల చెరువులను పునర్ధురించేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు 2వ దశ కింద, ఎపిసిబిడబ్ల్యుఎంపి 2వ దశ కింద 1200 చిన్న తరహా నీటిపారుదల చెరువులను ఆధునీకరించనున్నారు. చిన్ననీటి పారుదల వనరుల కింద 25.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని గుర్తించి, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2016-17 సంవత్సరం కన్నా 20117-18 సంవత్సరంలో ఈ శాఖకు 60 శాతం మేర అదనంగా నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియచేప్పే ప్రయత్నం చేసింది.