ఆంధ్రప్రదేశ్‌

పరిశ్రమల పంట పండింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 15: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపుల్లో పరిశ్రమల రంగానికి భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా పరిశ్రమల రంగానికి చేయూత నిచ్చేందుకు గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో 113.78 శాతం పెరుగుదల కనిపించింది. పరిశ్రమల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుదల కనిపిస్తాయన్న లక్ష్యంతో నిధులను భారీగా కేటాయించినట్టు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అలాగే స్ర్తి శిశు సంక్షేమానికి 33.14శాతం, రోడ్డు భవనాల శాఖకు 19.30శాతం, అధికంగా కేటాయించినట్టు ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖకు 15శాతం, మైనార్టీ సంక్షేమానికి 18.25శాతం, సాంఘిక సంక్షేమ శాఖకు 14.76శాతం, బిసీ సంక్షేమానికి 13.17శాతం, పురపాలక శాఖకు 10.12శాతం, వ్యవసాయ శాఖకు 7.73 నిధులను గత ఏడాది కంటే ఎక్కువగా కేటాయించామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక రంగాలైన వీటికి నిధులను కేటాయించడం ద్వారా భారీ సంస్కరణలు చేపట్టామని తెలిపిన ఆయన అన్ని రంగాలకు సమానత్వం పాటించామన్నారు.