ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు తీరువల్లే రోడ్లపైకి వచ్చాం : ముద్రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, మార్చి 15: కాపులను బిసిల్లో చేర్చుతానని చంద్రబాబు నాయుడు ఎన్నిక సమయంలో హామీ ఇవ్వడం వల్లే తాము రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర కాపుసంక్షే సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. విశాఖ జిల్లా, రాంబిల్లి మండలం గోకివాడలోని బంధువుల ఇంటికి బుధవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. చంద్రబాబునాయుడుపై విశ్వాసంతో కాపులు ఎన్నికల సమయంలో టిడిపికి ఓటు వేసి గెలిపించారని, అయితే, మూడేళ్ళు కావస్తున్న చంద్రబాబునాయుడు కాపులను బిసిల్లో చేర్చే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో తాము రోడ్డు ఎక్కి పోరాటం చేయవలసిన అవసరం వచ్చిందని ముద్రగడ చెప్పారు. రిజర్వేషన్లు కలిగిన కులాలకు ఎటువంటి భంగం కలుగకుండా కాపులను ఆదుకోవాలని కోరారు. ఈ ప్రయత్నానికి బిసి సోదరులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముద్రగడ అన్నారు. ఇప్పటి వరకు కాపులు నమ్మకంతో ఉన్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టకోనే బాధ్యత చంద్రబాబుపై ఉందని గట్టిగా చెప్పారు. కాపులను కరివేపాకులా వినియోగించుకుంటే మాత్రం సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తమకు ఇచ్చిన వాగ్దానాన్ని నేరవేర్చుకోవాడానికి పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోకివాడ మాజీ సర్పంచ్ ద్వారపురెడ్డి అప్పారావు, నానేపల్లి సాయి, ద్వారపురెడ్డి లక్ష్మి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.