ఆంధ్రప్రదేశ్‌

పోడియం ముట్టడించిన వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: శాసనసభ సమావేశాల్లో ఐదోరోజైన గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో వైకాపా సభ్యుల నిరసనలతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు అందిస్తున్న అవాస్తవ సమాచారాన్ని ప్రశ్నించేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు ఆరుసార్లు స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. నినాదాల హోరు మధ్య పరిస్థితి అదుపు తప్పటంతో స్పీకర్ కోడెల సభను రెండుసార్లు వాయిదా వేయాల్సివచ్చింది. ఒక దశలో స్పీకర్, ప్రతిపక్ష నేత జగన్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. మొత్తంపై గంటసేపు జరగాల్సిన ప్రశ్నోత్తరాలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగాయి. సభ ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలంటూ స్పీకర్ పలుమార్లు అభ్యర్థించారు. అయితే విపక్ష సభ్యులు ‘వియ్ వాంట్ జస్టిస్’.. అంటూ చేసిన నినాదాలు సభలో హోరెత్తాయి. అయితే స్పీకర్ ఎంతో నింపాదిగా ‘మీరు సభకు జస్టిస్ చేయండం’టూ కోరారు. వైకాపా సభ్యులు పోడియం వద్ద స్వీకర్, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే తన సీటులో కూర్చుని తిలకిస్తున్న జగన్‌ను ఉద్దేశించి కోడెల పలుమార్లు ‘దయచేసి మీ సభ్యుల్ని వెనక్కి రప్పించండం’టూ కోరారు. అయితే పలు సందర్భాల్లో జగన్ తన వెనుకనున్న సభ్యులను పోడియం వద్దకు వెళ్లండంటూ ఎడమ చేతితో సంకేతాలివ్వటం కనిపించింది. చేనేత కార్మికుల విషయంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చిన సమాధానంపై ‘కేవలం రెండే రెండు నిమిషాలు మాట్లాడతాను.. సమయం కేటాయించాలం’టూ వైకాపా సభ్యుడు పి అనిల్‌కుమార్ పెద్దగా కేకలు వేశారు. అయితే మైకులు కట్ కావటంతో సభ్యులంతా కలిసి పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఒక దశలో స్పీకర్ కోడెల జోక్యం చేసుకుంటూ ప్రతి ప్రశ్నలోనూ జగన్ జోక్యం చేసుకోవడాన్ని అనుమతించనన్నారు.