ఆంధ్రప్రదేశ్‌

సభలోకి ఎలా వెళ్లాలబ్బా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 16: నవ్యాంద్ర రాజధాని అమరావతి రూపుదిద్దుకున్న నూతన అసెంబ్లీ, మండలి భవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినప్పటికీ లోపలికి ప్రవేశించే విషయంలో మాత్రం కాస్త అయోమయానికి గురిచేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులు లోపలికి వెళ్ళేందుకు తికమకపడిన సందర్భం గురువారం లాబీల్లో కనిపించింది. సమావేశాలకు హాజరైయ్యేందుకు వచ్చిన మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి దారి కోసం కొద్ది సేపు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారితో ఉన్న అధికారులు కూడా కాస్త తికమకపడటంతో ప్రాంగణంలోని మార్షల్స్ వారికి దారి చూపించారు. దీనిపై స్పందించిన మంత్రి కామినేని అసెంబ్లీ మయసభను తలపిస్తోందని చమత్కరించడం విశేషం. డెప్యూటీ సిఎం ఛాంబర్‌లో కొద్ది సేపు గడిపిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు నేరుగా మండలిలోకి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చిన సంఘటన చోటుచేసుకొంది. ఇదే పరిస్థితిలో మండలిలోకి వెళ్ళబోయిన మంత్రి కొల్లు రవీంద్ర వెనువెంటనే తేరుకొని అసెంబ్లీలోకి వెళ్ళారు. ఇక లాబీల్లో పరిస్థితి అంతా సందడి సందడిగా ఉంది. ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సస్పెన్షన్ వ్యవహారం లాబీల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రారంభంలో కొన్ని అసౌకర్యాలు కనిపించినప్పటికీ నిదానంగా ఏర్పాట్లను మెరుగుపర్చుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో లాబీల్లో హడావుడి కనిపించింది. మంత్రులను ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వచ్చిన సందర్శకులతో పాటు సిబ్బంది సైతం హడావుడిగా కనిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లాబీల్లో ఎన్నికలపైన చర్చ సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఓటింగ్‌కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారి వారి జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.