ఆంధ్రప్రదేశ్‌

మీ సాయానికి కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ స్వాగతించింది. ఆ మేరకు ప్యాకేజీ చట్టబద్ధతకు కృషి చేసిన ప్రధాని, మంత్రులకు కృతజ్ఞతలు చెబుతూ గురువారం ధన్యవాద తీర్మానం ఆమోదించింది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీ సభలో ఉన్నప్పటికీ తీర్మానాన్ని వ్యతిరేకించింది. ధన్యవాద తీర్మానం ఇలా ఉంది. ‘మన రాష్ట్రానికిచ్చిన ప్రత్యేక సహాయానికి చట్టబద్ధత కల్పిస్తూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నూరు శాతం నిధులు సమకూరుస్తూ నిన్న సాయంత్రం కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం పట్ల శాసనసభ హర్షాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చూపిన చొరకు ధన్యవాదాలు తెలియజేస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు సమకూర్చే నిర్ణయానికి దోహదపడిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ధన్యవాదాలు తెలియజేస్తోంది. రాష్ట్ర అవసరాలను, రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక సహాయానికి మంత్రి మండలి ఆమోదం పొందడంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పోషించిన పాత్రకు రాష్ట్ర శాసనసభ ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఈ నిర్ణయాలు కేంద్ర మంత్రి మండలి తీసుకోవడానికి విశేష కృషి చేసిన మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పూసపాటి అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్, వైఎస్ చౌదరీలకు రాష్ట్ర శాసనసభ అభినందనలు తెలియజేస్తోంది. ప్రత్యేక హోదాతో ఒనగూడే ప్రయోజనాలకు సమానంగా అన్ని ప్రయోజనాలూ కలిగిస్తూ ప్రకటించిన ప్రత్యేక సహాయానికి చట్టబద్ధత కల్పించాలన్నది.. సత్వరంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలన్నది మన రాష్ట్ర ప్రభుత్వ అభిమతం, ప్రజల ఆకాంక్ష, ఇవి ఈ రోజు నెరవేరాయి. అశాస్ర్తియంగా జరిగిన రాష్ట్ర విభజన దుష్పరిణామాల పర్యవసానంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం మనకి శక్తినిస్తుంది.