ఆంధ్రప్రదేశ్‌

పాపం తమ్ముళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 16: ఒక్కోసారి పార్టీ నాయకత్వాలు తీసుకునే నిర్ణయాలు తెలియకుండానే ఎదురుదెబ్బగా మారుతుంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపార్టీ నేతల వేధింపులకు గురయి, జైళ్లకూ వెళ్లొచ్చిన కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా.. తమను వేధించి కేసులు పెట్టించిన వారికే తమ నాయకత్వం పదవులిచ్చి పెద్దపీట వేస్తే, వారి మనోభావాలు ఎలా ఉంటాయి? రాజధాని అమరావతిలోని తుళ్లూరు దొండపాడు తమ్ముళ్ల మాదిరిగా ఉంటాయి! కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆ తర్వాత తన రాజకీయ గురువు రాయపాటి చొరవతో తెలుగుదేశం తీర్థం తీసుకున్నారు. అంతకుముందు మిగిలిన వారి మాదిరిగా ఆయన కూడా చంద్రబాబునాయుడు మీద ధ్వజమెత్తిన వారే. ఆ సంగతి అటుంచితే.. టిడిపిలో చేరిన ఆయనకు తాజాగా పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది. దానితో మంత్రిగా ఉన్నప్పుడు డొక్కా వల్ల నష్టపోయిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ తమ నాయకత్వాన్ని సవాల్ చేసిన వైనం విస్మయపరిచింది.
డొక్కా అధికారంలో ఉన్నప్పుడు తమ దొండపాడు గ్రామంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించినప్పుడు, ఆ కేసులో అమాయకంగా ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించిన మాకు ఏ పదవి ఇస్తారంటూ ఏకంగా ఫ్లెక్సీల ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైనం నాయకత్వానికి సంకటంగా మారింది. ఆ ఫ్లెక్సీలో డొక్కా పేరు ప్రస్తావించకపోయినా ఆ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల వరకూ ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగిన విషయం తెలిసిందే.
తర్వాత ఆ ఫ్లెక్సీలను తొలగించినప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపార్టీ నేతల వల్ల తాము అనుభవించిన కష్టాలను గమనించకుండా, అదే వ్యక్తులను పార్టీలో చేర్చుకుని పదవులిస్తున్న తీరుపై సామాన్య కార్యకర్తల మనోభావావాలకు అద్దం పట్టాయి.