ఆంధ్రప్రదేశ్‌

అన్నీ కాకి లెక్కలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: గడచిన మూడేళ్లలో ఎక్కడా కనీసం ఒక్క గృహ నిర్మాణం కూడా పూర్తికాలేదు.. అయితే గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని పూర్తి అవాస్తవాలతో లక్షా, 35వేల గృహాలను నిర్మించామంటూ లిఖిత పూర్వక సమాధానమిస్తూ సభను తప్పుదారి పట్టిస్తున్నారంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పుల చెరిగారు. ఓ దశలో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. చర్చకు మరికొంత సమయం కావాలంటూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకంపై సభ్యులు పినె్నల్లి రామకృష్ణారెడ్డి, వై సాయిప్రతాప్ రెడ్డి, ఈనయ్య యక్కలదేవి, పి అనిల్‌కుమార్, రాజన్న దొర అడిగిన ప్రశ్నలకు మంత్రి మృణాళిని ఇచ్చిన సమాధానం పూర్తి అవాస్తమంటూ ప్రతిపక్ష నేత జగన్‌తోపాటు ఆ పార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తొలుత మంత్రి మృణాళిని సమాధనమిస్తూ రూ. 1918 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ సహాయంతో తమ ప్రభుత్వం రాష్ట్రంలో గడచిన మూడేళ్లలో 2,10,288 గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. 2014 జూన్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు కేంద్రం సహాయంతో 1,08,537 గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా చేపడుతున్నామన్నారు. గడచిన మూడేళ్లలో రూ. 3400 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 2,09,170 గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథకాల కింద 26,503 గృహాలను నిర్మించామన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. గత డిసెంబర్ 21, 22 తేదీల్లో సిఎం చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సమావేశాల్లో కేంద్రం నిధులతో మంజూరైన 1,08,000 గృహాలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన మరో 26వేల గృహాలు వెరసి 1,35,000 గృహాల నిర్మాణం చేపట్టలేదు. గ్రౌండ్ లెవల్లోనే ఉన్నాయి లిఖిత పూర్వకంకా తెలియచేస్తే ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ఎలా చెబుతారని ఆవేశంతో ప్రశ్నించారు. ఒకవేళ నిర్మాణాలు జరిగి ఉంటే సగటున ఇంటికి లక్షా, 25వేలు చొప్పున ఆరువేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉండాలి కదా బడ్జెట్‌లో ఆ కేటాయింపులు ఏవీ అంటూ నిలదీశారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు షేంషేం అంటూ బల్లలు చరిచారు. దీనికి ఏ మాత్రం సమాధానం ఇవ్వలేకపోయిన మంత్రి మృణాళిని వచ్చే రెండేళ్లలో 10 లక్షల ఇళ్లు కడతామంటూ భరోసాగా చెప్పారు. పేదలు సుఖసంతోషాలతో ఉండాలనేది తమ ప్రభుత్వ ధ్యేయంగా చెప్పారు. అసలు ఈ గృహ నిర్మాణ పథకం అడుగు ముందుకు పడకపోవడానికి గత కేంద్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలే కారణమన్నారు. విజిలెన్స్ అందజేసిన నివేదిక ప్రకారం తమ ప్రభుత్వం 690 మంది సిబ్బంది, 128 మంది అధికారులు, 170 మంది అనధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని 206 మంది సస్పెండ్ చేశామని చరిత్రలో గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా ఒక శాఖలో ఇంతమందిపై చర్య తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 46వేల ఇళ్ల నిర్మాణాలపై 58 మంది అధికారులపై చర్య తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఐదు కోట్లలకు పైగా అవినీతి జరిగిందన్నారు. ఇక కడప జిల్లాలో అనేకానేక అక్రమాలు జరిగాయి. ఈ విధంగా 175 నియోజకవర్గాల్లోనూ ఇళ్ల నిర్మాణాలపై విచారణ జరపాల్సి వచ్చిందన్నారు.

చిత్రం..పాలకపక్షంపై విరుచుకుపడుతున్న జగన్