ఆంధ్రప్రదేశ్‌

మోదీ మార్కు విధానాలతో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 16: నవ్యాంధ్రప్రదేశ్‌ను మోదీ మార్కు విధానాలతో అవినీతి రహిత...అభివృద్ధి సహిత సంక్షేమప్రదేశ్‌గా మార్చేందుకు ప్రయత్నిసున్నామని, దీనిలో భాగంగానే కేంద్ర నుండి అనేక సంస్థలతో పాటు పెద్ద ఎత్తున నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తీసుకు వస్తున్నట్లు శాసన మండలిలో బిజెపి సభ్యుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది.. దానికి దారి తీసున్న కారణాలు, అవలంబిస్తున్న విధానాలను స్పష్టంగా గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారని చెప్పారు. గురువారం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో వాడీవేడీ చర్చ నడిచింది. గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిన బిజెపి, సిపిఐ నేతలకు అడుగడుగునా కాంగ్రెస్ నేత సి రామచంద్రయ్య అడ్డుకున్నారు. అలాగే పలు అంశాలపై జరిగిన చర్చలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుంటూ విపక్షాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ముందుగా మాట్లాడిన ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖర్ గవర్నర్ ప్రసంగం పట్ల తీవ్ర అక్షేపణ వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రగంగం పూర్తిగా రాజకీయంగా, ప్రజాసామ్య విలువలకు విరుద్ధంగా ఉందన్నారు. దీనిపై కలుగజేసుకున్న మండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ రాజ్యాంగ విలువలకు తగ్గట్టుగానే గవర్నర్ వ్యవస్థ ఉంటుందన్నారు. కొన్ని సమయాల్లో పెద్దలు చేసిన తప్పులను భూతద్దంలో చూడవద్దన్నారు. వెంటనే కాంగ్రెస్ పక్ష నేత సి రామచంద్రయ్య కలుగచేసుకుని గవర్నర్ వ్యవస్థను తప్పుదారి పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సిపిఐ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అంశంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అందరూ బాధ్యులే అంటూ, చరిత్రను తప్పదారి పట్టించవద్దన్నారు. టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కలుగచేసుకుని మునుపెన్నడూ లేని విధంగా పుష్కరాలను ప్రభుత్వం నిర్వహించిందని, దీనిపై అక్షేపణ ఎందుకన్నారు. దీనిపై పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ స్పందిస్తూ ఇటు వంటి చర్యల కారణం గానే రాష్ట్రంలో అశాంతి నెలకొంటోందన్నారు. గుంటూరు జిల్లాలో వాస్తవ పరిస్థితులు అంటూ ఆయన కొన్నింటిని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత ప్రభుత్వాలు చేయని విధంగా మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుండి అత్యధిక ధరకు మిర్చి కొనుగోలు చేస్తున్నామని, దీనిని స్వయంగా వైకాపా ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పరిశీలించారని తెలిపారు. వెంటనే కలుగజేసుకున్న ఉమారెడ్డి వాస్తంగా రైతులకు జరుగుతున్న లబ్ధితో పాటు వారిని అదుకునే అంశాలనే చర్చించాలని సూచించారు. వాస్తవ పరిస్ధితులను ఇప్పటికైనా గర్తించి ప్రభుత్వం కళ్లు తెరవాలని, లేని పక్షంలో గత కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని చెప్పి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తన ప్రగంగాన్ని ముగించారు. అనంతరం మాట్లాడిన బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర విభజన అనివార్యం అన్న సమయంలో రాష్ట్రానికి రావాల్సిన, కావాల్సిన వాటిపై బిజెపి స్పష్టమైన విధానాలను అవలంబించిందన్నారు. దీనిలో భాగంగానే ఎంతో కీలకమైన పోలవరం పరిధిలోని ఆరు ముంపు మండలాలను మనరాష్ట్రానికే వచ్చేలా చేశామన్నారు. దీనిపై సి రామచంద్రయ్య వీర్రాజుకు మధ్య కొద్ది సేపు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.