ఆంధ్రప్రదేశ్‌

చేనేతలకు ఏడాదికి వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: చేనేత కార్మికుల సంక్షేమంపై గురువారం శాసనసభలో వాడివేడి చర్చ సాగింది. బడ్జెట్‌తో ప్రమేయం లేకుండానే ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటనపై ప్రతిపక్ష వైకాపా సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం సాలీనా వెయ్యి కోట్లు చొప్పున కేటాయిస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికి మూడువేల కోట్లు జమ కావాల్సి ఉంటే కేవలం రూ.145 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు.. దీన్నిబట్టి చూస్తే వారిపై బాబుకు ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతుందంటూ వైకాపా సభ్యులు అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. రుణమాఫీ కింద లక్షా 15వేల చేనేత కుటుంబాలకు సంబంధించి రూ.360 కోట్లు మాఫీ చేయాలంటూ కోటయ్య కమిటీ సిఫార్స్ చేస్తే కేవలం 25వేల కుటుంబాలకు సంబంధించి రూ.110 కోట్లు మాత్రమే మాఫీ చేసారంటూ విమర్శించారు. శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అనిల్‌కుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేనేత కార్మికుల గురించి ప్రస్తావించినప్పుడు దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడే సమయంలో విపక్ష సభ్యుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. అనిల్‌కుమర్ మాట్లాడుతూ దివంగత వైఎస్ హయాంలో చేనేత కార్మికులకు హెల్త్‌కార్డులు, బీమా సదుపాయం, 50 ఏళ్లు దాటినవారికి పెన్షన్లున్నాయి. ప్రస్తుతం హెల్త్‌కార్డులు, బీమా లేదు, కొత్త పెన్షన్లు లేవన్నారు. పరిశీలించి మగ్గాలున్నవారికే పెన్షన్లు ఇస్తామంటున్నారు, ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. ఒక్కచోట కూడా నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు కాలేదన్నారు. గృహ నిర్మాణాలతో నిమిత్తం లేకుండా వర్క్‌షెడ్ నిర్మాణానికి లక్షా 50వేలు రుణం అందించాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి రవీంద్ర బదులిస్తూ బడ్జెట్‌తో నిమిత్తం లేకుండానే వివిధ పథకాల కింద చేనేత కార్మికుల కోసం సాలీనా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ పాలకపక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో నామమాత్రంగానే నిధులు విడుదల అయ్యాయని అన్నారు. ప్రస్తుతం ఆరు జిల్లాల్లో శిక్షణా కేంద్రాలు ప్రారంభించామన్నారు. జనతా పథకాన్ని ప్రారంభించబోతున్నామన్నారు.
బేడ, బుడగ, జంగాలను
ఎస్‌సి జాబితాలో చేర్చాలి
బేడ, బుడగ, జంగాల కులాల వారిని మానవతా దృక్పథంతో ఎస్‌సి జాబితాలో చేర్చాలని సభ్యులు గొల్లపల్లి సూర్యారావు, డాక్టర్ బి.జయనాగేశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పొరుగునున్న కర్నాటకలో ఎస్‌సిలుగా కొనసాగుతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఎస్‌సి కులధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి కుల ధ్రువీకరణ పత్రాలు పొందలేకపోతున్న కారణంగా విద్యాసంస్థల్లో ప్రవేశాలు దొరక్క నష్టపోతున్నారని అన్నారు. దీనిపై మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ ఎస్‌సి జాబితాలో ఏ కులాన్ని చేర్చాలన్నా కేంద్రం అనుమతి అవసరమని అన్నారు. అందుకే సిఎం చంద్రబాబు దీనిపై ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతూ తక్షణం జీవో జారీచేసి ఆయా కులాలకు న్యాయం చేయాలని కోరారు.