ఆంధ్రప్రదేశ్‌

అందరి దృష్టీ కడపపైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 16: కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో వైకాపా పోటీ చేస్తున్న ఏకైక స్థానం ఇదే కావడం గమనార్హం. జిల్లాలో స్థానిక సంస్థల్లో పూర్తిబలం ఉన్న వైకాపా గెలుపుపై కొండంత ధీమాగా ఉండగా, మారిన సమీకరణల నేపధ్యంలో విజయం తమనే వరిస్తుందని టిడిపి భరోసాగా ఉంది. దీంతో ఈ ఎన్నిక ప్రత్యేకత సంతరించుకుంది. శుక్రవారం జరుగనున్న పోలింగ్‌లో కడప, జమ్మలమడుగు, రాజంపేటలోని పోలింగ్ కేంద్రాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కడప స్థానిక సంస్థల ఎన్నిక ఓ ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. వైకాపా అధినేత జగన్ తన బాబాయి వైఎస్.వివేకానందరెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దివంగత నేత పట్ల జిల్లాలో ఉన్న సానుభూతి, వివేకా సమర్థత, స్థానిక సంస్థల్లో బలం తమకు కలిసివస్తాయని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పలుసార్లు జిల్లాలో పర్యటించి స్థానిక ప్రతినిధులతో నేరుగా మాట్లాడారు. వారం రోజుల క్రితం తమ పార్టీ ప్రతినిధులందరినీ బెంగళూరు క్యాంపునకు తరలించారు. ఇక టిడిపి తమ అభ్యర్థిగా బిటెక్ రవిని ప్రకటించింది. పార్టీకి జిల్లాలో ఉన్న బలం, కొత్తగా వచ్చి చేరిన వారితో కలుపుకోవడం ద్వారా నూతనోత్సాహంతో దూసుకుపోతోంది. స్థానిక ఎన్నికల్లో వైకాపాను ఓడించడం ద్వారా రాజకీయంగా పార్టీని దెబ్బతీయవచ్చనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు పలుసార్లు స్థానిక నేతలతో మంతనాలు జరిపారు. తమ ప్రతినిధులను పాండిచ్చేరికి తరలించి అక్కడ ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేశారు. శుక్రవారం జరిగే ఓటింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో శాసన మండలి డిప్యుటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి ఖరారుచేసినట్లు సమాచారం.