ఆంధ్రప్రదేశ్‌

బడ్జెట్‌ను అపహాస్యం చేస్తున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 17: రాష్ట్భ్రావృద్ధితో పాటు పరిపాలనలో కీలక పాత్ర వహించే బడ్జెట్ ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానురాను అపహాస్యం చేస్తున్నారని, ప్రస్తుత వార్షిక బడ్జెట్‌ను చూస్తే ఈవిషయం స్పష్టంగా అవగతమవుతుందని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి శుక్రవారం ఇక్కడ విమర్శించారు. గత మూడు బడ్జెట్‌ల మాదిరిగానే ప్రస్తుత బడ్జెట్ కూడా నిరాశాజనకంగా వుందన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను సైతం సక్రమంగా ఖర్చుచేయలేని దుస్థితికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులే నిదర్శనమన్నారు. రైతు రుణమాఫీ కోసం కేటాయించిన రూ.36వేల కోట్లు వడ్డీకే సరిపోదని, రుణమాఫీ చేస్తామంటూ ఓట్లు దండుకొన్న చంద్రబాబు తీరని అన్యాయం చేశారన్నారు. నిరుద్యోగ భృతికి కేటాయించిన 500 కోట్లు, 10 వేల ఉద్యోగాల కల్పన వట్టి బూటకమన్నారు. పేదలకు గృహ నిర్మాణానికి 12వేల కోట్ల కేటాయింపుతో ఎన్ని ఇళ్లు నిర్మిస్తారో ఎవ్వరికీ అవగతం కావడం లేదన్నారు. నదుల అనుసంధానం ద్వారా 10లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికే 108, 104 సేవలు అంతంతమాత్రంగా ఉండటంతో అడుగంటిన వైద్యసేవలు ఇక మున్ముందు అదృశ్యమవుతాయన్నారు.