ఆంధ్రప్రదేశ్‌

వేడుకగా జగన్నాథ రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 17: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోన్న చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో అంతర్జాతీయ శ్రీకృష్ణ సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో శుక్రవారం భారీ స్థాయిలో జగన్నాధ రధయాత్ర నిర్వహించారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక, సంస్కృతీ, సంప్రదాయాల జానపద నృత్యాలు, లొట్టి పిట్టలు, శే్వత అశ్వాల పల్లకీల రథయాత్ర కనుల పండువగా సాగింది. 70 దేశాల నుంచి సుమారు 150 మంది విదేశీ శ్రీకృష్ణ భక్తులు ఈ రథయాత్రకు హాజరయ్యారు.
భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ భారతీయ సంప్రదాయ వస్త్ర ధారణలో విదేశీయులు తమ భక్తిపారవశ్యాన్ని చాటారు. శ్రీకృష్ణుడి మంగళకర ఆధ్యాత్మిక భజన చేసుకుంటూ భారతీయ సంస్కృతిని చాటడం విశేషత సంతరించుకుంది. ఇస్కాన్ రాజమహేంద్రవరం శాఖ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు శ్రీ జగన్నాథుడిని భారీ రథాన్ని తాళ్లతోలాగుతూ భక్త్భివాన్ని చాటుకున్నారు. దారిపొడవునా స్వామివార్లను దర్శించుకుంటూ వేలాది భక్తులు తరించారు. విదేశీ భక్తులు దేవతా మూర్తుల వేషధారణలతో నృత్య రూపకాలు ప్రదర్శించడం విశేషంగా ఆకట్టుకుంది. జగన్నాథ రథంపై సత్యగోపీనాథ్ దాస్ భక్తులకు ఆశీస్సులు అందించారు. ముందుగా ఇస్కాన్ వ్యవస్థాపక స్వామీజీ ప్రభుపాదుల స్వామివారి సజీవ మూర్తిగా దర్శనమిచ్చే విగ్రహాన్ని శే్వతాశ్వ రథంపై ఊరేగించారు. రాజభటుల వేషధారణలో భక్తులు ప్రభుపాదుల స్వామివారి పల్లకిని పర్యవేక్షించారు. అప్పటికపుడు కళ్లాపి జల్లి ముగ్గులు పెడుతూ శుభ్రం చేసిన రోడ్డుపై స్వామివారి రథాన్ని లాగారు.

చిత్రం.. రాజమహేంద్రవరం నగరంలో జగన్నాధ రధయాత్ర