ఆంధ్రప్రదేశ్‌

టీవి సీరియల్స్ తీరు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 18: చిన్న పిల్లల నుంచి మహిళల వరకు అందర్నీ విలన్లుగా జుగుప్సాకరంగా చూపిస్తున్న టీవి సీరియల్స్ తీరు మారాలని, ఇందుకోసం తాము మానవహక్కుల కమిషన్, సెన్సార్ బోర్డు దృష్టికి ఈవిషయాన్ని తీసుకువెడతామని మహిళ కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ మహిళలను హంతకురాలిగా, కిడ్నాపర్లుగా, దాడును ప్రోత్సహించేవారిగా, విలన్లుగా చూపిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. దీనికి తోడు ఎలా చంపాలన్న తీరును కూడా ప్రదర్శిస్తుండటం టివి సీరియల్స్‌పై జుగుప్ప కలిగిస్తోందన్నారు.ఇటువంటి సీరియల్స్ సమాజాన్ని పాడుచేస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రహదారుల వెంబడి మద్యం దుకాణాలు తొలగిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా కమిషన్ సక్రమంగా పనిచేయడానికి వీలుగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరతానని నన్నపనేని చెప్పారు.