ఆంధ్రప్రదేశ్‌

మడుగుపల్లిలో గంగమ్మ గలగలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్పల, మార్చి 18: భైరవుని సన్నిధిలో గంగమ్మ ఉబికి ఉబికి వస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా 175 బోరు బావుల్లో నీరు పుష్కలంగా పడింది. ఈ బోర్లన్నీ పక్కపక్కనే ఉండడం గమనార్హం. ఏడాది పొడవునా బోర్లలో నీరు వస్తుండడంతో గ్రామంలోని రైతులు అరటితోటలు పండించి లాభాలు గడిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామ శివారులోని భైరవుడి ఆలయం, అక్కడి బోర్ల సంగతి ఓసారి పరికిద్దాం.. 20 ఏళ్ల క్రితం గ్రామంలో ఎటు చూసినా ఎడారి ఛాయలే. అరకొరగా కురిసే వానలను నమ్ముకుని గ్రామంలోని రైతులు సంప్రదాయ వేరుశనగ విత్తుకునే వారు. వానలు కురవక వేసిన పంట ఎండిపోయి అప్పులపాలయ్యేవారు. తాగేందుకు నీళ్లు దొరికేవి కావు. వాన నీటిని నిల్వ చేసుకుని మూడు నాలుగు నెలల పాటు తాగేవారంటే పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు గ్రామంలో ఫ్యాక్షన్ గొడవలతో నిత్యం మరణమృదంగం వినిపించేది. దీంతో వలసలు తప్పలేదు. ఇలాంటి సమయంలో గ్రామంలోని ఓ రైతుకు తట్టిన ఆలోచన ఆ ఊరు స్వరూపానే్న మార్చివేసింది. గ్రామానికి చెందిన ఓ రైతు శివారులో వెలసిన బయన్నస్వామి(్భరవుడు) సన్నిధిలో బోరు బావి తవ్వించాడు. స్వామి దయతో రెండున్నర ఇంచుల నీరు పడింది. ఆ రైతును అనుసరించిన మరి కొంత మంది రైతులు అక్కడే బోర్లు తవ్వించారు. అన్ని బోర్లలో నీళ్లు పడడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో గ్రామంలోని రైతులంతా వేరుశెనగ విత్తడం వదిలేసి అరటి వైపు మళ్లారు. గ్రామంలోని నేలలు అరటి పంటకు బాగా అనుకూలంగా ఉండడంతో ప్రతి రైతు ఇంట్లో సిరులు కురవడం మొదలైంది. ఒక్కొక్కటి చొప్పున బయన్నస్వామి సన్నిధిలోని అర ఎకరం స్థలంలో బోర్ల సంఖ్య ఏకంగా 175కి చేరింది. అన్ని బోర్లలోనూ నీళ్లుండడం సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక్కడ వేసిన బోర్ల నుండి రైతులు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న తమ పొలాలకు పైపుల ద్వారా నీళ్లు పెట్టుకుని పంటలు పండిస్తున్నారు. ఈ విషయంపై గ్రామంలోని ఏ రైతును కదిలించినా అంతా భైరవస్వామి మహత్యమేనని చెబుతారు. మడుగుపల్లి గ్రామంలో నీటి కష్టాలు కూడా స్వామి వారి కృపాకటాక్షాలతో తీరిపోయాయి. ఒకప్పుడు తలసరి ఆదాయంలో జిల్లాలో అట్టడుగున ఉన్న మడుగుపల్లి గ్రామం ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉండడం ఆనందంగా ఉందని గ్రామస్థులు గర్వంగా చెబుతున్నారు.