ఆంధ్రప్రదేశ్‌

త్వరలో మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 18: రాష్ట్రంలో త్వరలో 45 మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నట్టు పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కె.కృష్ణమూర్తి వెల్లడించారు. ప్రస్తుతం టెండర్లు దశలో ఉన్నాయన్నారు. ఈ మేరకు శనివారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. ప్రతి జిల్లాకు మూడు మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు రాబోతున్నాయని, వీటితో పాడిపశువులకు వైద్య సేవలు అందిస్తామని వివరించారు. ఇదిలా ఉండగా పాడి పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఎపి నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో ఐసిటి టెక్నాలజీ ద్వారా గాలికుంటు వ్యాధి టీకాలను అత్యధికంగా 90 లక్షల పశువులకు వేయగలిగామన్నారు. ఇందుకుగాను 8 ఆసియాదేశాల్లో 296 మంది పోటీ పడగా ‘మంతన్’ అవార్డు రాష్ట్రానికి దక్కిందన్నారు. ఇదిలా ఉండగా పొరుగు రాష్ట్రాల నుంచి ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో పాలు, గుడ్లు, మాంస ఉత్పత్తుల ఆదాయ లక్ష్యం రూ.60వేల కోట్లు కాగా, రూ. 53098 కోట్లు చేరుకున్నామని పేర్కొన్నారు. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ముందంజలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 2379 గ్రామాల్లోని 6643 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా గ్రామాల్లో రైతులకు కిలో పచ్చగడ్డి రూ.1 రైతులకు సరఫరా చేస్తారని వివరించారు.
3,600 పశుమిత్రలు
రాష్ట్రంలో 3600 మంది పశుమిత్రలను నియమించనున్నట్టు కృష్ణమూర్తి తెలిపారు. వీరు పాడి పశువులకు అందించే వైద్యసహాయానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. జిల్లాలో 300 పశుమిత్రలను నియమించనున్నట్టు తెలిపారు. వీరికి శిక్షణనిచ్చి ఆయా గ్రామాల్లో నియమిస్తామని వివరించారు.