ఆంధ్రప్రదేశ్‌

బ్లూ బేబీకి అరుదైన శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(జగదాంబ), మార్చి 18: విశాఖలో అరుదైన శస్తచ్రికిత్స జరిగింది. శరీర నిర్మాణ లోపంతో నెలలు నిండకుండా జన్మించి, బ్లూ బేబీగా మారిపోయి, ప్రమాదస్థితిలో ఉన్న నవజాత శిశువుకు సెవెన్ హిల్స్ ఆసుపత్రి వైద్యులు శనివారం అరుదైన శస్తచ్రికిత్స జరిపి, కాపాడారు. పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ ఎల్.విజయ్, కార్డియాలజిస్ట్‌లు కిరణ్‌బాబు, రంజని ముఖర్జీ సంయుక్త ఆధ్వర్యంలో శస్తచ్రికిత్స చేశారు. 50 రోజుల శిశువుకు పది గంటలపాటు శస్తచ్రికిత్స నిర్వహించారు. చెడు రక్తం శరీరంలోని అన్ని భాగాల్లోకి వ్యాపించడంతో శిశువు నీలం రంగులోకి మారిపోయింది. అత్యంత ఖరీదైన వైద్య పరికరాలను ఉపయోగించి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన రైల్వే ఉద్యోగి కుటుంబానికి జన్మించిన ఈ శిశువుకు ప్రత్యేక వైద్యసేవలు అందించడంతో కోలుకుంటుందని, త్వరలోనే డిచార్జి చేస్తామని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.దినకర్ విలేఖర్లకు తెలిపారు.