ఆంధ్రప్రదేశ్‌

విద్యాశాఖలో మరో ‘లీక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 18: విద్యా శాఖలో కొద్ది రోజులుగా ప్రశ్నాపత్రాల లీక్‌ల పరంపర కొనసాగుతోంది. పరీక్షలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ పక్క ప్రకటిస్తున్నా, లీకులు మాత్రం యథావిధిగా జరిగిపోతున్నాయి. ఈ దుస్థితి ఎక్కువగా విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే జరగడం గమనార్హం. రెండు రోజుల కిందట ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న బిఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకైంది. నిన్నటికి నిన్న పదోతరగతి పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే బయటకు వచ్చింది. శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రాన్ని ఇచ్చేశారు. చివరకు ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్‌మెంట్ (సంగ్రహణాత్మక పరీక్ష) పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయంటే విద్యా వ్యవస్థ తీరుతెన్నులేంటో అర్థమవుతున్నాయి. రాష్ట్రంలో ఎనిమిది, తొమ్మిది తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించి, ఇందులో వచ్చే మార్కుల్లో ఐదు శాతం మార్కులను టెన్త్ పరీక్షల్లో వెయిటేజ్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మిటివ్ ఎసెస్‌మెంట్ పరీక్షలు ఈ సంవత్సరం నుంచే ఆరంభమయ్యాయి. పదో తరగతి విద్యార్థులతోపాటు, ఈనెల 17 నుంచే ఎనిమిది, తొమ్మిది తరగతి విద్యార్థులకు కూడా సమ్మిటివ్ ఎసెస్‌మెంట్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం జరగాల్సిన థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్-2 శనివారమే బయటకు వచ్చేసింది. ఈ పేపర్ జిరాక్స్ కాపీలు విశాఖలోని అన్ని మీడియా కార్యాలయాలకు చేరుకున్నాయి. అలాగే వాట్సాప్‌ల్లో కూడా ఈ పేపరు హల్‌చెల్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉమ్మడి పరీక్షా విధానం కింద ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో పేపర్ లీక్ జరగడం గమనార్హం. కాగా సమ్మిటివ్ అసెస్‌మెంట్ పరీక్షా పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రశ్నాపత్రం వాట్సాప్‌లోకి ఎలా వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నామని అన్నారు.
బికాం ఫైనల్ ఇయర్ పేపర్ తారుమారు
బొబ్బిలి: స్థానిక ఇందిరాగాంధీ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన బి.కాం ఫైనల్ ఇయర్ పరీక్షాపత్రాలు తారుమారయ్యాయి. బి.కాం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు బిజినెస్ లాకు సంబంధించి తెలుగుమీడియం ప్రశ్నప్రతాలను ఇవ్వాల్సి ఉండగా ఇంగ్లీష్‌మీడియంలో ఇవ్వడంతో విద్యార్థులు తెల్లముఖం వేశారు. అలాగే 100మార్కులకు పేపరు ఇవ్వాల్సి ఉండగా 70మార్కులకు ఇవ్వడంతో ఆందోళన చెందారు. అయినప్పటికీ ఇంగ్లీష్‌లో ఉన్న ప్రశ్నలను అర్థం చేసుకుని సుమారు 204మంది విద్యార్థులు తెలుగులో పరీక్షను రాసి నిర్వాహకులకు అందించారు. కళాశాల ప్రిన్సిపల్ అప్పలనాయుడును వివరణ కోరగా తమకు వచ్చిన పేపరు పార్సిల్‌లో ఇవే ఉన్నాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.

చిత్రం..లీకైన నైన్త్ సమ్మెటివ్ అసెస్‌మెంట్ పేపర్