ఆంధ్రప్రదేశ్‌

వేడుకగా ఖాద్రీ నృసింహుని బ్రహ్మరథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో వేంచేసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శనివారం వేడుకగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణ మధ్య రథం ముందుకు కదిలింది. కాటమరాయుడి బ్రహ్మరథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తొలుత ఆలయంలోని యాగశాలలో శ్రీవారికి నిత్యహోమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపుగా ఉత్సవమూర్తులను తీసుకువచ్చి రథంపై ఆశీనులను చేయించారు. రథం ముందు కలశాలను ఉంచి పూజలు నిర్వహించారు. కలశతీర్థంతో రథానికి అభిషేకం చేశారు. కూష్మాండ బలి అనంతరం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ఉదయం 7.29 గంటలకు రథం ముందుకు సాగింది. కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటూ భక్తులు జయజయధ్వనాలు చేశారు. స్వామివారి కాపులైన కుటాగుళ్ల, మూర్తిపల్లి, బేరిపల్లి, గంగిరెడ్డిపల్లి భక్తులు వెనుకవైపు తెడ్లు వేసి రథం ముందుకు కదిలేలా చేశారు. దవనాన్ని రథంపైకి విసిరి భక్తులు స్వామిని తమ బాధలు తొలగించమని వేడుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.