ఆంధ్రప్రదేశ్‌

చెరువు తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివలింగం, నంది విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 18: కృష్ణా జిల్లా గూడూరు మండల పరిధిలోని ముక్కొల్లు గ్రామంలో క్రీ.శ 1403వ సంవత్సరంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని కనుగొన్నట్లు చరిత్ర పరిశోధకుడు ఎండి సిలార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరు చరిత్ర పుస్తక రచయిత సిలార్ ముక్కొల్లు జెడ్పీ హైస్కూల్ సమీపంలోని పూడిపోయిన చెరువును ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ డా. బెల్లంకొండ రమేష్ చంద్రతో కలిసి తవ్వించగా సున్నపు రాతితో చేసిన శివలింగం, నల్లరాతితో చెక్కిన నంది విగ్రహాలు బయటపడినట్లు తెలిపారు. నంది విగ్రహాన్ని గ్రామంలోని మహారుద్రేశ్వరుని ఆలయంలోని వృషభేశ్వర స్వామికి సమర్పించినట్లు శిలాశాసనాలు బయటపడ్డాయని చెప్పారు. శిథిలమైన శివలింగాన్ని చెరువులో జలపతనం చేసి మరో శివాలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. చెరువు ఒడ్డున శివలింగాన్ని ఉంచామన్నారు. జనార్ధనస్వామి ఆలయం వెనుక ఉన్న పెద్దపాటిదిబ్బను తవ్వితే మరిన్ని చారిత్రక విశేషాలు బయటపడే అవకాశం ఉందని సిలార్ వివరించారు.