ఆంధ్రప్రదేశ్‌

యుపి సిఎం ప్రమాణస్వీకారోత్సవానికి బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదిత్య యోగినాథ్ దాస్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. లక్నోలో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే కార్యక్రమానికి విజయవాడ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు.
సిఎంకు కాపు నేతల కృతజ్ఞతలు
కాపు కార్పొరేషన్‌కు వచ్చే బడ్జెట్‌లో 1000 కోట్ల రూపాయలు కేటాయించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాపు కార్పొరేషన్ ప్రతినిధులు శనివారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాపుల అభ్యున్నతికి అండగా ఉంటానన్న మాటను సిఎం నిలబెట్టుకున్నారని కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి రాష్టవ్య్రాప్తంగా లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షుడు నరహరిశెట్టి శ్రీహరి, ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, ఘంటా గౌతమ్, వివిధ జిల్లాలకు చెందిన పవన్‌కుమార్, పద్మారావు, అడపా మాళవిక, భారతి, తదితరులు ఉన్నారు.