ఆంధ్రప్రదేశ్‌

త్వరలో టెక్నాలజీ విజన్ పోలీసింగ్ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 18: నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు త్వరలోనే ‘టెక్నాలజీ విజన్ పోలీసింగ్ వ్యవస్థ’ను ప్రారంభించినున్నట్లు డిజిపి నండూరి సాంబశివరావు చెప్పారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం సాయంత్రం టెక్నాలజీ విజన్ పోలీసింగ్ అంశంపై డిజిపి సాంబశివరావు, ఫోరెన్సిక్ సలహాదారు గాంధీ, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం డిజిపి విలేఖరులతో మాట్లాడుతూ నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసింగ్ వ్యవస్థ చాలా అవసరమన్నారు. ఈ వ్యవస్థ విజయవంతం కావాలంటే కచ్చితమైన డేటా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుని ముందుకెళ్లాల్సిన అవసరముందంటూ ఆయన తగిన సూచనలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో లక్ష కేసులు నమోదయితే ప్రాంతాల వారీగా నేరాల తీరును బేరీజు వేసి ఆయా ప్రాంత ప్రజల్లో అవగాహన పెంచితే కేసుల సంఖ్య తగ్గుతుందని ఆయన ఉదహరించారు. నేరాలు తగ్గించేందుకు, ప్రజలకు మెరుగైన సేవలు కల్పించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇకపై ప్రతినెలా కమిటీ సమావేశమై విజన్ పోలీసింగ్ వ్యవస్థను సమీక్షిస్తుందని, ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. టెక్నాలజీ విజన్ పోలీసింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలుపరిచి తద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తామని డిజిపి సాంబశివరావు వివరించారు. చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, కార్యదర్శి సాయిప్రసాద్, హోంశాఖ కార్యదర్శి అనూరాధ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు