ఆంధ్రప్రదేశ్‌

వేదవిద్య అభివృద్ధికి టిటిడి సేవలు అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, మార్చి 19: తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో గుంటూరు జిల్లా కోటప్పకొండపై రూ.5కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల, మరో రూ.5కోట్లతో నిర్మించిన భక్తుల వసతి సముదాయాలను శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోడెల మాట్లాడుతూ కోటప్పకొండపై వేద పాఠశాలను సువిశాలమైన స్థలంలో నిర్మించారని, ఉద్యానవనాలు పెంచడం ద్వారా ఆధ్యాత్మిక శోభను ఇనుమడింపచేయాలని కోరారు. వేద విద్య అభివృద్ధికి టిటిడి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ టిటిడి అనేక సేవా కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యరంగాల అభివృద్ధికి ఇతోధికంగా సహకరిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు 50 వేల మందికి విద్యనందించినట్లు తెలిపారు. టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు మాట్లాడుతూ వేదం గురించి ప్రచారానికి టిటిడి ఏటా రూ. 50కోట్లు ఖర్చుచేస్తోందని వివరించారు. సనాతన ధర్మంలో భాగమైన వేదఘోష నేల నలుచెరగులా ప్రతిధ్వనించేందుకు తిరుపతిలో వేద విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పురాతన ఆలయాల పరిరక్షణకు టిటిడి ఆర్థిక సహకారాన్ని అందిస్తోందన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 7 వేద పాఠశాలల్లో వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారన్నారు. వేదశాస్త్రం అభ్యసించేవారికి మూడు లక్షలు, ఆగమశాస్త్ర విద్యార్థులకు లక్ష చొప్పున ముందుగానే ఆ విద్యార్థి పేరుతో డిపాజిట్ చేస్తామన్నారు. కోర్సు పూర్తికాగానే వడ్డీతో కలిపి సంబంధిత విద్యార్థికి అందజేస్తామని వివరించారు. హిందూ పరిరక్షణ కార్యక్రమం కింద ఆలయాలు నిర్మించుకునేందుకు టిటిడి తమవంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని వెల్లడించారు. జెఎన్‌టియు ఉప కులపతి కుమార్, టిటిడి పాలకమండలి సభ్యులు బివి రమణ, నరసరావుపేట మునిసిపల్ చైర్మన్ సుబ్బరాయగుప్తా, ఆర్డీవో రవీంద్ర, తదితరులు ప్రసంగించారు.

చిత్రం..కోటప్పకొండలో టిటిడి సహకారంతో నిర్మించిన వేదపాఠశాల, భక్తుల వసతి సముదాయాలను ప్రారంభిస్తున్న టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, స్పీకర్ కోడెల, ఇవో సాంబశివరావు