ఆంధ్రప్రదేశ్‌

రాంకీ పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: ఆంధ్రప్రదేశ్‌లో పెడన- నూజివీడు- విస్సన్నపేట రహదారి విస్తరణ పనుల కాంట్రాక్టు తమకే కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటీషన్‌ను ఉమ్మడి హైకోర్టు తొసిపుచ్చింది. జస్టిస్ చల్లా కోదండరామ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కనీసం తమ దరఖాస్తును పరిశీలనకు సైతం ప్రభుత్వం పరిగణించలేదని సంస్థ ఆరోపించింది.
బలవంతంగా రికవరీ చేయకండి
ఆంధ్రప్రదేశ్ సర్వీసు టాక్స్‌కు సంబంధించి 612 కోట్ల రూపాయల రికవరీకి బలవంతం చేయవద్దని రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సర్వీసు టాక్స్‌కు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ వి బాలసుబ్రమణియన్, జస్టిస్ జె ఉమాదేవీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులను ఇచ్చింది.
సర్వీసు టాక్స్‌గా 594.19 కోట్లు, విద్యాసెస్ 11.83 కోట్లు, సెకండరీ విద్యా సెస్ 5.94 కోట్లు, దానిపై వడ్డీలు కలిపి మొత్తం 612 కోట్ల రూపాయలు అవుతుందని, దానిని రికవరీ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది.