ఆంధ్రప్రదేశ్‌

గెలిచినా భయం.. ఓడినా ఆనందం.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 20: ఎవరైనా విజయం సాధిస్తే ఆనందంతో ఉత్సవాలు చేసుకుంటారు. ఓడినవారు అన్నీ పక్కన పెట్టి ఇంటి కి వెళ్లి మదనపడతారు. అయితే కర్నూలు లో సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయి న తరువాత అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపించింది. విజయం సాధించిన టిడిపి లో భయం కనిపించగా వైకాపాలో ఆనం దం వెల్లివిరిసింది. ఇందుకు కారణం టిడిపి ఊహించినట్లుగా ఓట్లురాకపోవడం, వైకాపా అనుకున్న సంఖ్య కన్నా అధిక ఓట్లు రావడమే. టిడిపి విజయం సాధ్ఘించినా ఓట్లు తక్కువ రావడంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్న ఆందోళన నేతల్లో ఉండగా, భవిష్యత్తు ఎన్నికల్లో తమదే గెలుపు అని, ప్రస్తుత ఫలితాలు ఇవే సంకేతా లు ఇచ్చాయని వైకాపా నేతలు పేర్కొనడం గమనార్హం. ఓడినందుకు వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకోలేదు కాని అందరిలోనూ సంతోషం కనిపించడం, నవ్వుతూ ఒకరినొకరు పలుకరించుకుంటూ వచ్చే ఎన్నికల్లో 14 స్థానాలు మనవేనంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. టిడిపికి వచ్చిన ఆధిక్యత ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సంతృప్తినివ్వలేదని పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఆయన గతంలో ఆదేశించిన ప్రకారం 150 ఓట్ల మెజారిటీ రావా ల్సి ఉంది. 200 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించి వస్తామని జిల్లా నేతలు చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.