ఆంధ్రప్రదేశ్‌

కత్తి నరసింహారెడ్డి ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 20: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యా య ఎమ్మెల్సీగా కడప జిల్లాకు చెందిన కత్తి నరసింహారెడ్డి విజయబావుటా ఎగురవేశారు. ఆయ న తన సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై 3,763 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నరసింహారెడ్డికి మొత్తం 9,624 ఓట్లు వచ్చాయి. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కత్తి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 5,861 ఓట్లు పోలయ్యాయి. అనంతపురం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సోమవారం ఉదయం పశ్చి మ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ పత్రాలను కట్టలుగా కట్టిన అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 1.40 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీపడిన ఈ స్థానానికి తొలుత రెం డు రౌండ్ల ఓట్లు లెక్కించే సమయానికి వామపక్షాలు బలపరచిన అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి 5,603 ఓట్లతో మొదటిస్థానంలో నిలిచారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఒంటేరు శ్రీనివాసరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చల పుల్ల య్య, నాల్గవ స్థానంలో సర్ణ రఘురామయ్య ఉన్నారు. దీంతో ద్వితీ య ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును సాయం త్రం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఎలిమినేషన్ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కి స్తూ రాత్రి 11 గంటలకు ఏడుగురు అభ్యర్థుల్ని తొలగించారు. ఆరవ అభ్యర్థి ఎలిమినేషన్ సమయానికి కత్తి నరసింహారెడ్డికి 7,699 ఓట్లు, రెండో స్థానంలో ఉన్న ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 4,622 ఓట్లు, బచ్చల పుల్లయ్యకు 3,396 ఓట్లు దక్కాయి. ఏడో అభ్యర్థి రఘురామయ్య ఎలిమినేషన్‌తో కత్తి నరసింహారెడ్డి 8057 ఓట్ల మెజారిటీతో దూసుకుపోయారు. మొత్తం పోలైన 18,739 ఓట్లతో నోటా, చెల్లని ఓట్లు పోను 9151 ఓట్లు (50 శాతం మార్కు)కు చేరుకోవడంతో కత్తి నరసింహారెడ్డి విజేతగా నిలిచారు.
పట్ట్భద్రుల ఓట్ల లెక్కింపు
పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రుల ఓట్ల లెక్కింపు తొలిరౌండ్‌లో ఎన్‌జిఓ సంఘం మాజీ అధ్యక్షుడు, వైకాపా అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి 8,648 ఓట్లతో ముందజంలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం అభ్యర్థి కెజె రెడ్డి 6,515, డాక్టర్ గేయానంద్ 5,259 ఓట్లు దక్కించుకున్నారు. మొత్తం 1,55, 563 ఓట్లను గాను 26 టేబుల్స్‌లో కౌంటింగ్ సాయంత్రం ప్రారంభమైంది.