ఆంధ్రప్రదేశ్‌

జగన్ బెయిల్ రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 28: అక్రమాస్తుల కేసులో ప్రతిపక్ష వైసిపి అధినేత వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఆయా కేసుల్లో బెయిల్‌పై బయట ఉన్న జగన్మోహన్‌రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ సిబిఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ పిటిషన్‌లో వివరించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సిబిఐ కోర్టు ఏప్రిల్ 7వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని జగన్‌ను ఆదేశించింది. జగన్‌కు చెందిన సాక్షి ఛానల్‌లో ప్రసారమైన ఓ కథనమే దీనంతటికీ కారణంగా తెలుస్తోంది. వైఎస్ హయాంలో చీఫ్ సెక్రటరీగా పని చేసిన రమాకాంత్‌రెడ్డిని ఇటీవల సాక్షి టివి ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ గురించి కూడా సిబిఐ పిటిషన్‌లో ప్రస్తావించింది. ఆ ఇంటర్వ్యూ దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉందని సిబిఐ పేర్కొనడంతో కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్‌పై నమోదైన కేసుల విచారణ డొల్లగా ఉందని, ఈ కేసులు నిలబడవని, నాటి సిబిఐ జెడి లక్ష్మీనారాయణ వద్ద తాను ప్రస్తావించినట్లు సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సిబిఐ దర్యాప్తు మీద తనకు నమ్మకం లేదని కూడా ఆయన అన్నారు. అంతేకాకుండా సిబిఐపై పలు ఆరోపణలు చేశారు. సిబిఐ వాళ్లకు సెక్రటేరియట్ నిబంధనలు, కార్యదర్శులకుండే అధికారాలు, రూల్స్ తెలియవని పేర్కొన్నారు.