ఆంధ్రప్రదేశ్‌

రూ. 90 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 4: ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గంగాధరం ఆస్తులు లెక్కకట్టడానికి నాలుగు రోజులు పట్టింది. తవ్వే కొద్దీ ఆయన అక్రమాస్తులు బయటపడుతునే ఉన్నాయి. ఆయన అక్రమార్జన ఎంత? అన్నది ఎసిబి అధికారులు చివరకు లెక్కతేల్చారు. గంగాధరం అక్రమంగా కూడబెట్టిన బంగారు ఆభరణాలను, విలువైన డాక్యుమెంట్లను మంగళవారం విశాఖ ఏసిబి కార్యాలయానికి తీసుకువచ్చారు. ఏసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ మంగళవారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడుతూ గంగాధరం కుటుంబ సభ్యుల పేరిట ఐఎన్‌జి వైశ్యా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో 90 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను గుర్తించామని చెప్పారు. అలగే, గంగాధరం, ఆయన కుటుంబ సభ్యుల పేరిట 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఉన్నాయని, ఇందులో గంగాధరం ఒక్కరి పేరుమీద 21.79 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉందని ఆయన చెప్పారు. అలాగే నాలుగు కిలోల బంగారం లభించిందని ఆయన తెలియచేశారు. ఇప్పటి వరకూ గంగాధరం ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులు 10 కోట్లుగా గుర్తించామని డిఎస్పీ చెప్పారు. వీటి మార్కెట్ విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.

చిత్రం..గంగాధరం ఇంటిలో ఎసిబి అధికారులు సీజ్ చేసిన బంగారు ఆభరణాలు