ఆంధ్రప్రదేశ్‌

సాంకేతిక పద్ధతులతో విపత్తుల సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, ఏప్రిల్ 4: వివిధ కాలాల్లో విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయటానికి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కొత్త సాంకేతిక పద్ధతులను అమల్లోకి తెచ్చి అమలు పరుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల మేనేజ్‌మెంట్ అధారిటీ ఎండి, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ కమిషనర్ శేషగిరి బాబు తెలిపారు. విపత్తుల శాఖ కమిషనర్, ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ అధికారులతో కలిసి మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లి, కుంచనపల్లిలో గల డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనానంతరం రాష్ట్ర విపత్తుల మేనేజ్‌మెంట్ అధారిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారన్నారు. అందులో భాగంగా మంగళవారం విపత్తులకు సంబంధించిన వెబ్‌సైట్, యాప్‌ను ఆవిష్కరించామన్నారు. ఇస్రో, షార్‌తో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు గురించి సమాచారం అందించటానికి, వివిధ కాలాల్లో విపత్తుల సమాచారాన్ని ముందుగా అధికారులకు అందించే విధంగా ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎండ తీవ్రతల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజూ ఎండ తీవ్రతపై సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకు అందిస్తున్నామన్నారు. ఇన్నోవేటివ్ లాబ్, ఇంక్యుబేటర్ సెంటర్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారన్నారు. కజాలా యాప్ ద్వారా గ్రామాల్లో విఆర్‌వోలతో మాట్లాడుతున్నామన్నారు. ఇస్రో సైంటిస్ట్ రాజశేఖర్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పులకు సంబంధించి వారానికి సరిపడా నివేదికలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన డిడి శివశంకర్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.