ఆంధ్రప్రదేశ్‌

‘బాబుకే జాబు వచ్చింది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాయకాపురం), ఏప్రిల్ 9: జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు ప్రచారం చేశారని, కానీ ఎన్నికల అనంతరం బాబుకు మాత్రమే జాబు వచ్చిందని, ఎన్టీఆర్ ఆరోగ్యమిత్రలో పనిచేస్తున్న 2వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ జీవో 28 విడుదల చేశారని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకట రామారావు విమర్శించారు. ఆదివారం హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో గోవిందు అధ్యక్షతన జరిగిన ఎపి ఎన్టీఆర్ వైద్యమిత్ర ఎంప్లారుూస్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. 2011 నుండి ప్రభుత్వ సంస్థ అయిన ఆరోగ్యమిత్రలో కనీస వేతనాలు అమలుచేయడం లేదని, ఈవిషయంలో మంత్రి గాని, కార్మిక శాఖ గాని స్పందించడం లేదన్నారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రచారార్భాటాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు.