ఆంధ్రప్రదేశ్‌

పదవులు పొందిన పనిమంతులేరీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 9: అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సమీకరణలు, ప్రాంతాల పేర్లు చెప్పి నామినేటెడ్ చైర్మన్ పదవులు పొందిన వారిలో అధిక శాతం పార్టీ కార్యకలాపాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ తరహా చైర్మన్ల పనితీరుపై తాజాగా నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ల రామయ్య, డొక్కా మాణిక్యవరప్రసాద్ వంటి ఒకరిద్దరు కార్పొరేషన్ చైర్మన్లు తప్ప, మిగిలిన వారెవరూ ప్రత్యర్థుల విమర్శలపై ఎదురుదాడి చేయకుండా ఇచ్చిన పదవులను అనుభవిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవులు పొందిన అగ్రకుల నేతలు వౌనంగా ఉంటుండగా ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌ల చైర్మనే్ల ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తున్నారంటున్నారు. ఇప్పుడు పదవుల్లో ఉన్నవారిలో అర్హత లేనివారే ఎక్కవగా ఉన్నారని, అందువల్ల ఆ తప్పు వారిది కాదని, ఇచ్చిన నాయకత్వానిదేనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అర్హత లేనివారికి పదవులిచ్చి, ఇప్పుడు వారిని తప్పు పట్టడం ఏమిటంటున్నారు. వీరందరికంటే కారెం శివాజీ చాలా మేలంటున్నారు. డజన్ల సంఖ్యలో చైర్మన్లు ఉన్నా వారిలో ఇద్దరు, ముగ్గురు తప్ప పార్టీ పనికి అక్కరకురావడం లేదు. ఫలానా వాళ్లతో మాట్లాడించాలని ఆదేశించిన తర్వాతనే ఆయా అంశాలపై కొందరు చైర్మన్లు మాట్లాడుతున్నారు తప్ప, స్వచ్ఛందంగా మాట్లాడుతున్నవారెవరూ కనిపించని పరిస్థితి నెలకొంది. ఒకవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిల్లా బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ హోదాలో జగన్‌పై నిరంతరం ఎదురుదాడి చేస్తున్న వర్ల రామయ్య, పార్టీలో చేరిన నాటి నుంచి ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్న ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, సందర్భానుసారంగా జూపూడి, అనూరాధ మాత్రమే తరచూ మాట్లాడుతుంటే మిగిలిన వారు మాత్రం అసలు స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మీడియా కమిటీ ప్రక్షాళన!
కాగా పార్టీ మీడియా కమిటీని ప్రక్షాళన చేయాలన్న సూచన సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. తెలంగాణ నేపథ్యం ఉన్న ప్రస్తుత మీడియా కమిటీ చైర్మన్ ప్రసాద్ గిడ్డంగుల సహకార సంస్థ చైర్మన్, జాతీయ మీడియా కమిటీ కన్వీనర్‌గా రెండు పదవులు నిర్వహిస్తున్నారు. అయితే ఏపి రాజకీయాలు, ప్రతిపక్షాలు, ప్రాంతాలపై అవగాహన, అనుభవం ఉన్న వారికి ఏపి మీడియా కమిటీ బాధ్యలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘మిగిలిన పార్టీల మాదిరిగా రాజకీయ ప్రత్యర్థుల బలహీనలతో పాటు, ప్రభుత్వ విజయాలను మీడియాలో వార్తలు రాయించడం, మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడం, వారితో నిరంతర సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంలో ఆసక్తి, అనుభవం ఉన్నవారే మాకు కావాలి. అదే ఇప్పుడు కరవయింది. అలాంటి వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తే మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలు మరింతగా జనంలోకి వెళతాయి.