ఆంధ్రప్రదేశ్‌

కార్మికులకు ఆధునిక పరికరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 9: రాష్ట్ర కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు వెలగపూడి సచివాలయంలో ఆదివారం ఘన స్వాగతం లభించింది. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పితాని ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వందలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. తొలుత కార్మిక శాఖ ఉన్నతాధికారులు మంత్రి పితాని సత్యనారాయణ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ ముత్యాల రత్నం, డిసిఎంఎస్ చైర్మన్ రవివర్మ, నరసాపురం శాసనసభ్యుడు బండారు మాధవనాయుడు, పోలవరం శాసనసభ్యుడు మిడియం శ్రీనివాసరావు, ఉండి శాసనసభ్యుడు కలవపూడి శివ, శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణరాజు, జిల్లా ప్రజాపరిషత్ ఉపాధ్యక్షురాలు చింతల వెంకటరమణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, కార్మిక శాఖ ఉప కమిషనర్ సూర్యప్రకాశరావు, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్పీటిసిలు పితానికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన పారిశ్రామికవేత్తలు, వివిధ శాఖల అధికారులు దుశ్శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా కార్మిక సంక్షేమానికి సంబంధించిన తొలి ఫైలుపై పితాని సంతకం చేశారు. కార్మికులకు వివిధ వృత్తుల్లో ఆధునిక శిక్షణ, ఆధునిక పరికరాలు అందించేందుకు సంబంధించి ఈ ఫైలును సిద్ధం చేశారు.