ఆంధ్రప్రదేశ్‌

ఫిరాయింపులపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 9: పార్టీ ఫిరాయింపులు కొత్తగా వచ్చిన అంశమేమీ కాదని, చాలాకాలంగా అన్ని రాజకీయ పార్టీల్లోనూ జరుగుతున్నదేనని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏదో ఒకరోజు ఫుల్‌స్టాప్ పడాల్సిందేనన్నారు. అయితే పార్లమెంట్ వేదికగా దీనిపై చర్చ జరిగి సమగ్ర చట్టాన్ని రూపొందించాల్సిన బాధ్యత పార్లమెంట్‌దేనని స్పష్టం చేశారు. ఈ అంశంలో కోర్టులు గానీ, రాష్ట్రాలు గానీ ఏమీ చేయలేవన్నారు. వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారని, రాజ్యాంగాన్ని తానొక్కడే పరిరక్షిస్తున్నట్లు భావిస్తున్నారని విమర్శించారు. సీమాంధ్రలోని ఒంటిమిట్ట రామాలయంలో రాష్ట్ర పండువగా కల్యాణోత్సవం జరగడం దళితులంతా గర్వించదగ్గ విషయమన్నారు. ఒంటిమిట్ట రామాలయాన్ని నిర్మించింది దళితుడు, తమ తాత అయిన ఆదిజాంభవుడు అని చెప్పారు. ఇది తానేదో ప్రత్యేకంగా చెప్పడం లేదని, అక్కడి స్థల పురాణం చెప్తున్నదేనని ఆయనన్నారు. అమరావతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి 14 వరకు సామాజిక న్యాయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాబూ జగ్జీవన్‌రాం, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.