ఆంధ్రప్రదేశ్‌

టివి సీరియల స్‌లో ‘హింస’ దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 9: వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న ధారావాహికాల్లో మహిళలకు సంబంధించి భయంకరమైన రీతిలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఆడ పిల్లల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తంచేశారు. హీరోయినే్ల విలన్లుగా నటించడంతో పాటు చిన్న పిల్లలు, పెళ్లి కావలసిన పిల్లలకు ఎవరిని ఎలా చంపాలో, అత్తగారిని కోడలు ఎలా చంపాలి? కోడలను అత్తగారెలా చంపాలో సమాజానికి నేర్పుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం ఆమె విలేఖర్లతో మాట్లాడారు. టెలివిజన్ ధారావాహికాలకు సెన్సార్ బోర్డు అంటూ అమల్లో ఉందా అని ప్రశ్నించారు. ఇటువంటి ధారావాహికాల నిరోధానికి త్వరలో రాష్ట్ర మహిళా కమిషన్ ఓ తీర్మానం చేయనున్నట్టు స్పష్టంచేశారు.
సినిమాల్లో విలన్లను మించిపోయిన విధంగా మహిళా విలన్లు మారారన్నారు. సీరియల్స్‌లో వివిధ సన్నివేశాలు కుట్రతో నిండిపోయి, సమాజం నాశనం అయ్యేలా, మహిళల్లో ఇంతటి ద్వేషం ఉంటుందా అని సమాజానికి చెప్పే విధంగా చిత్రీకరిస్తున్నారన్నారు. సంవత్సరాల తరబడి ప్రసారమయ్యే ధారావాహికాల్లో పెళ్ళి కావల్సిన పిల్లలతో వివిధ రకాల వేషాలు వేయిస్తూ హత్యలను ప్రోత్సహించే రీతిలో చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని ఏ విధంగా చంపాలో, ఏ విధంగా కాల్చాలో, ఏ విధంగా నాశనం చేయా లో వీటిని చూసి నేర్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
సినిమాల్లో చివరిలో విలన్ పశ్చాత్తాపం చెందినట్టు చూపుతారని, టీవీ సీరియల్స్‌లో కనీసం అది కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో జరుగుతున్న గొప్ప గొప్ప సంఘటలను కూడా టీవీలలో చూపిస్తున్నారని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే టీవీ ఛానెళ్ళు మంచి కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు కృషిచేయాలని రాజకుమారి కోరారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఆమె కోరారు. బాల్య వివాహాల వలన మేనరికాలు, ఇష్టం లేకుండా పెళ్ళి చేయడం, వయసులో తేడాలు వంటివి ఉంటాయన్నారు. అయోషా మీరా కేసు జరిగి 10 సం వత్సరాలు అయిందని, అప్పటికి ఆ అమ్మాయికి 19 సంవత్సరాలని, అత్యాచారం జరిపి చంపిన వారిపైనా, అందుకు సహకరించిన పోలీసులపై చర్యలు చేపట్టాలన్నా రు. ఈ కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినట్టు చెప్పారు. చిన్న పిల్లలు, బాల కార్మికులకు పని చేయించరాదని, రొయ్యలు, బొమ్మల పరిశ్రమల్లో పనిచేస్తున్న బాలలను గుర్తించి నిరోధిస్తామని నన్నపనేని స్పష్టం చేశారు. సమావేశంలో కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి, తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి ఎం జ్యోతి, ఐసిడిఎస్ పిడి పి శారదాదేవి తదితరులు పాల్గొన్నారు. కాగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని నన్నపనేని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో మహిళా రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

చిత్రం..కాకినాడ ప్రభుత్వాసుపత్రి మహిళా వార్డులో రోగులకు అందుతున్న సేవలను పరిశీలిస్తున్న మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి