ఆంధ్రప్రదేశ్‌

బెయల్ రద్దు భయంతోనే ఢిల్లీకి జగన్ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 9: అవినీతి, అక్రమార్జన కేసులో ఎక్కడ బెయిల్ రద్దు చేస్తారోనన్న భయంతోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. మచిలీపట్నంలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జగన్ తీరును ఆయన తూర్పారబట్టారు. చంద్రబాబు పరిపాలనకు ఆకర్షితులై వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు టిడిపి తీర్ధం పుచుకున్నారని, వీరిలో సమర్ధులకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌లకు చెందిన ఎమ్మెల్యేలు నాడు కాంగ్రెస్‌లో చేరారని, అయితే వారంతా రాజీనామా చేశారా అని మంత్రి రవీంద్ర ప్రశ్నించారు. అక్రమార్జన కేసులో బెయిల్‌పై తిరుగుతున్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సిబిఐ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ బెయిల్ రద్దు అవుతుందోనన్న భయంతోనే జగన్ మంత్రివర్గ విస్తరణను ఎత్తి చూపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల ముఖ్యుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.