ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్టీసీ కొత్త సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, సరుకు రవాణా, వాహనాల వివరాలు తెలుసుకునేందుకు కొత్త సంస్కరణలు చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా, భవనముల శాఖ మంత్రి సిద్దా రాఘవరావు తెలిపారు. రహదారులపై ప్రమాదాల నివారణకు స్పీడ్ గవర్నర్లు, ప్రైవేటు వాహనాలు, సరుకు రవాణాకు సంబంధించిన వాహనములను జిపిఎస్‌తో అనుసంధానం చేసేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రమాదాలను నియంత్రించేందుకు బస్సులు, లారీల వంటి వాహనాల గరిష్ట వేగాన్ని పరిమితం చేసినట్టు ఆయన తెలిపారు. లారీలు, ప్రైవేటు, ఆర్టీసి బస్సులకు గరిష్ట వేగం 80 కి.మీ. బడి బస్సులు, డంపర్లు, పెట్రోలు, డీజిల్, ఇతర రసాయనాల ట్యాంకర్లకు గరిష్ట వేగం 60 కి.మీ.లకు పరిమితం చేసినట్టు, అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక శకటాలకు వెసులుబాటు కల్పించినట్టు ఆయన తెలిపారు. 3,500 కేజీల లోపు బరువున్న నాలుగు చక్రాల వ్యక్తిగత వాహనాలకు వేగంపై పరిమితి ఉండదని మంత్రి రాఘవరావు పేర్కొన్నారు.
సరుకు రవాణా వాహనదారులందరూ తమతమ వాహనాలకు జిపిఎస్ పరికరాన్ని అమర్చుకుంటే ఈ జిపిఎస్ పరికరాన్ని రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాటు చేయనున్న కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నట్టు ఆయన వివరించారు.
ఈ జిపిఎస్ పరికరాన్ని అమర్చుకోవడం వల్ల వాహన యజమానులకు తమతమ వాహనాలు ఎక్కడున్నాయో..గమ్యం ఎప్పుడు చేరతాయో, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఏ ప్రాంతంలో జరిగిందో వంటి మొదలైన వివరాలను ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.